పనబాక స్ట్రాంగ్ క్యాండిడేట్ కాదా?

పనబాక లక్ష్మి తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా ఎంపికయ్యారు. త్వరలో జరిగే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పనబాక లక్ష్మి ఇప్పటికే ప్రచారాన్ని [more]

Update: 2020-12-03 06:30 GMT

పనబాక లక్ష్మి తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా ఎంపికయ్యారు. త్వరలో జరిగే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పనబాక లక్ష్మి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఆమె ప్రచారాన్ని ప్రారంభించడం చంద్రబాబు వ్యూహంలో భాగమే. అయితే పనబాక లక్ష్మి ఎంత వరకూ స్ట్రాంగ్ క్యాండిడేట్ అన్న చర్చ తెలుగుదేశం పార్టీలోనే జోరుగా జరుగుతుండటం విశేషం.

లోకల్ అయినా…..

పనబాక లక్ష్మి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు. ఆమె గతంలో నెల్లూరు, బాపట్ల రిజర్వడ్ స్థానం నుంచి విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అందరికీ తెలిసిన వ్యక్తి. ఇవే పనబాక లక్ష్మికి ప్లస్ పాయింట్లు. అయితే లోకల్ అయినా పనబాక లక్ష్మి స్థానికంగా అందుబాటులో ఉండరన్న వాదన ఉంది. ఎవరితో పెద్దగా కలవరని, క్యాడర్ ను కూడా పట్టించుకోరని గత ఎన్నికలకు ముందే ఆమె విషయంలో ప్రూవ్ అయింది.

సాధారణ ఎన్నికల్లో….

సాధారణంగా పార్లమెంటు, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరుగుతుండటంతో ఎంపీ అభ్యర్థులను పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. ఎమ్మెల్యే అభ్యర్థుల బలంతో పాటు అప్పటి పార్టీకి ఉన్న ఊపు మీద ఎంపీ అభ్యర్థుల గెలుపు ఆధారపడి ఉంటుంది. అందుకే సాధారణ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులను పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ ఈసారి జరిగేది ఉప ఎన్నిక కావడంతో పనబాక లక్ష్మితో పాటు అభ్యర్థులను కూడా ప్రజలు పరిగణనలోకి తీసుకుంటారు.

రిజిస్టర్ కావాలని….

అందుకే వీలయినంతగా ప్రజల్లోకి ముందుగా వెళితే రిజిస్టర్ అవుతారని చంద్రబాబు పనబాక లక్ష్మిని ఎంపిక చేశారంటున్నారు. కానీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తిరుపతి మినహాయించి మిగిలిన ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో టీడీపీ వీక్ గా ఉంది. వీటన్నింటిని అధిగమించడం, ఆ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలను సమన్వయం చేసుకుని వెళ్లడం పనబాక లక్ష్మికి సవాల్ గా మారనుంది. మరి పనబాక లక్ష్మి స్ట్రాంగ్ క్యాండిడేట్ అని నమ్మి చంద్రబాబు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News