పళనిస్వామి ఆ పని చేయకపోయి ఉంటే?

పళనిస్వామిపై చక్కని అభిప్రాయం ఉంది. ఆయన మూడున్నరేళ్ల పాటు తమిళనాడును మంచిగా పరిపాలించారు. ఎన్నికలకు ముందు తమిళనాడులో అందరూ చెప్పే మాటే. కానీ పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే [more]

Update: 2021-05-03 17:30 GMT

పళనిస్వామిపై చక్కని అభిప్రాయం ఉంది. ఆయన మూడున్నరేళ్ల పాటు తమిళనాడును మంచిగా పరిపాలించారు. ఎన్నికలకు ముందు తమిళనాడులో అందరూ చెప్పే మాటే. కానీ పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమి ఓటమి పాలయింది. దారుణంగా ఓడిపోకపోయినా గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకుంది. నాయకత్వ లోపం, అనేక సమస్యలతోనే పళనిస్వామి అధికారంలోకి రాలేకపోయారన్న వాదన ఉంది.

ఇమేజ్ ఉన్న నాయకుడు….

నిజానిక పళనిస్వామి ఇమేజ్ ఉన్న నాయకుడేమీ కాదు. జయలలిత మరణం, శశికళ జైలు పాలయిన తర్వాత అనూహ్యంగా ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కారు. సొంత పార్టీలోని అసంతృప్తులను సర్దుబాటు చేసుకుంటూనే పాలనపై పట్టు బిగించారు. పెద్దగా అవినీతి ఆరోపణలు కూడా పళనిస్వామి ఎదుర్కొనలేదు. ఈ ఎన్నికల్లో అంతా తానే అయి ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా పళనిస్వామి వ్యవహరించారు.

బీజేపీతో చెలిమి…..

అయితే బీజేపీ తో చెలిమి పళనిస్వామిని దెబ్బతీసిందంటారు. పళనిస్వామిపై సదభిప్రాయం ఉన్పప్పటీకి బీజేపీతో జట్టు కట్టడం ఎక్కువమందికి నచ్చలేదు. బీజేపీ పై ఆధారపడటం తమిళ ప్రజలు ఆత్మగౌరవంగా భావించారు. మరోవైపు బీజేపీపై దేశ వ్యాప్తంగా అసంతృప్తి ఉంది. ఈ ఎఫెక్ట్ పళనిస్వామిపై పడింది. బీజేపీతో జట్టుకట్టకండా ఉండి ఉంటే మరిన్ని స్థానాలను పళినిస్వామి దక్కించుకునే వారంటారు. ఇప్పటికీ తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో అన్నాడీఎంకే తన పట్టును నిలుపుకుంది.

శశికళను దూరం చేసుకోవడం….

ఇక పళనిస్వామి పార్టీ ఓటమికి మరో ప్రధాన కారణం శశికళను దూరం చేసుకోవడమే. శశికళను దూరం చేసుకోకుండా ఉండి ఉంటే కొంత సానుకూలత లభించేది అంటున్నారు. దినకరన్ పార్టీ ఫలితాల పరంగా పెద్దగా ప్రభావం చూపకపోయినా అనేక నియోజకవర్గాల్లో ఓట్లను చీల్చడంతో అన్నాడీఎంకే అభ్యర్థులు ఓటమి పాలయ్యారంటున్నారు మొత్తం మీద పళనిస్వామి నేతృత్వంలో ఇన్ని సమస్యలున్నా 76 స్థానాలను సాధించడం గొప్ప విషయమేనంటున్నారు.

Tags:    

Similar News