పళనిస్వామి… ఫెయిల్యూర్ సీఎం కాదట

పళనిస్వామి ప్రస్తుతం తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారు. పోలింగ్ తర్వాత వస్తున్న విశ్లేషణల ప్రకారం అన్నాడీఎంకే ఈసారి [more]

Update: 2021-04-19 18:29 GMT

పళనిస్వామి ప్రస్తుతం తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారు. పోలింగ్ తర్వాత వస్తున్న విశ్లేషణల ప్రకారం అన్నాడీఎంకే ఈసారి అధికారంలోకి రావడం కష్టమే. తమిళనాడు వ్యాప్తంగా ప్రజలు డీఎంకే వైపు మొగ్గు చూపారంటున్నారు. సినిమా తారల నుంచి సామాన్యుల వరకూ ఈసారి డీఎంకేకు ఒక్క చాన్స్ ఇవ్వాలని భావించడంతో పళనిస్వామి పక్కకు తప్పుకోవడం అనివార్యమని ఆ పార్టీ నేతలు కూడా అంగీకిరిస్తున్నారు.

కిందిస్థాయి నుంచి వచ్చి…..

పళనిస్వామి కింది స్థాయి నుంచి వచ్చిన నేత. జయలలిత మెప్పు పొంది ఆయన పదవులు పొందారు. జయలలితకు నమ్మకమైన నేతగా గుర్తింపు పొందారు. అదే సమయంలో కీలకంగా ఉన్న శశికళ పట్ల సయితం పళనిస్వామి భక్తి శ్రద్ధలు కనపర్చారు. దాని ఫలితమే పన్నీర్ సెల్వం స్థానంలో పళనిస్వామి ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే పళనిస్వామి తాను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిని కాదని నిరూపించుకోగలిగారు.

ముఖ్యమంత్రిగా పనితీరు….

దాదాపు నాలుగేళ్ల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయన కనపర్చిన పనితీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కరోనా కష్ట సమయంలోనూ పళనిస్వామి తమిళనాడు ప్రజలకు అండగా నిలిచారు. కేసులు తీవ్రత ఎక్కువవుతున్న సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకుని కరోనాను కొంత మేరకు నివారించగలిగారు. ఇక నాలుగేళ్లలో తమిళనాడులో అభివృద్ధి కూడా జరిగింది. అదే సమయంలో సంక్షేమాన్ని కూడా పళనిస్వామి విస్మరించలేదు.

అవినీతి ఆరోపణలు…..

జయలలిత ప్రవేశ పెట్టిన ప్రతి పథకాన్ని పళనిస్వామి అమలుపర్చారు. పెద్దగా అవినీతి ఆరోపణలను కూడా పళనిస్వామి ఎదుర్కొనక పోవడం ఈ సందర్బంగా గమనార్హం. అయితే డీఎంకే పై ఉన్న సానుభూతి, పళనిస్వామి బీజేపీతో జట్టుకట్టడం వంటి అంశాలు అన్నాడీఎంకే విజయానికి అవరోధాలుగా మారాయన్నది ఎన్నికల అనంతరం విన్పిస్తున్న విశ్లేషణ. అయితే విజయం సాధించకపోయినా తమిళనాడు రాజకీయాల్లో పళనిస్వామి సక్సెస్ ఫుల్ ముఖ్యమంత్రిగా మిగిలిపోతారన్నది వాస్తవం.

Tags:    

Similar News