ఎడప్పాడికి అదే ఇబ్బందట.. అందుకే నో ఛాన్స్ అట

పళనిస్వామి నాలుగేళ్ల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాలుగేళ్లు జయలలిత, కరుణానిధికి ఏమాత్రం తీసిపోకుండా జనరంజక పాలనను పళనిస్వామి అందించారు. ఎక్కువమంది తమిళనాడులో ఇదే రకమైన అభిప్రాయాన్ని [more]

Update: 2021-04-07 17:30 GMT

పళనిస్వామి నాలుగేళ్ల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాలుగేళ్లు జయలలిత, కరుణానిధికి ఏమాత్రం తీసిపోకుండా జనరంజక పాలనను పళనిస్వామి అందించారు. ఎక్కువమంది తమిళనాడులో ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే పళనిస్వామికి ప్రమాదం బీజేపీ నుంచే ఉందన్నది నిపుణుల అంచనా. బీజేపీని తమిళనాడు ప్రజలు పెద్దగా ఇష్టపడకపోవడానికి అనేక కారణాలున్నాయి.

బీజేపీ గ్రిప్ లో….

జయలలిత మరణం తర్వాత శశికళను జైలుకు పంపించడం, పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య సయోధ్య కుదర్చడం, అన్నాడీఎంకే నుంచి శశికళ కుటుంబ సభ్యులను తప్పించడం వంటి వాటిలో బీజేపీ భాగస్వామ్యం ఉంది. గత నాలుగేళ్లుగా పళనిస్వామి పాలన సక్రమంగానే చేస్తున్నప్పటికీ బీజేపీ చెప్పినట్లే నడుుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ప్రతి నిర్ణయానికి ఢిల్లీ వైపు చూస్తుండటం పళనిస్వామికి మైనస్ గా మారిందంటున్నారు.

డీఎంకే పై సానుభూతి….

మరో వైపు డీఎంకే పట్ల సానుభూతి కూడా పళనిస్వామి పార్టీ విజయం సాధించకపోవడానికి మరొక కారణంగా చెబుతున్నారు. కరుణానిధి మరణంతో పాటు పదేళ్ల పాటు డీఎంకే అధికారానికి దూరంగా ఉండటంతో ఎక్కువ మంది ప్రజలు ఒక్కసారి స్టాలిన్ కు ఛాన్స్ ఇస్తే ఏమవుతుందన్న అభిప్రాయంలో ఉన్నారు. అనేక సర్వేల్లో ఇదే విషయం స్పష‌్టమయింది. దీంతో పళనిస్వామికి బీజేపీ, డీఎంకే పట్ల సానుభూతి ఈ ఎన్నికల్లో అడ్డంకిగా మారనున్నాయి.

పాలన పై సంతృప్తిగా ఉన్నా…..

అలాగే అన్నాడీఎంకేలో అనేక మంతి అసంతృప్త నేతలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. వారంతా దినకరన్, డీఎంకే పార్టీలకు మద్దతుదారులుగా కొనసాగుతున్నారు. విజయ్ కాంత్ వంటి నేతలు కూడా కూటమి నుంచి వెళ్లిపోవడం పళనిస్వామి జోరుకు కళ్లెం పడినట్లేనని అంటున్నారు. పళనిస్వామి పాలన పట్ల పెద్దగా వ్యతిరేకత ప్రజల్లో పెద్దగా లేకపోయినా అనేక అంశాలు ఆయనకు ఈ ఎన్నికల్లో అవరోధంగా మారనున్నాయి.

Tags:    

Similar News