డాక్టర్ రమేష్ అందుకే బుక్కయ్యారా?

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో రమేష్ ఆసుపత్రి యాజమాన్యం బుక్కయింది. పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే రమేష్ ను అరెస్ట్ కూడా చేయనున్నారు. అయితే [more]

Update: 2020-08-21 11:00 GMT

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో రమేష్ ఆసుపత్రి యాజమాన్యం బుక్కయింది. పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే రమేష్ ను అరెస్ట్ కూడా చేయనున్నారు. అయితే రమేష్ కు ఈ పరిస్థితి రావడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. రమేష్ విజయవాడ, గుంటూరులో కార్పొరేట్ ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. పోతిన రమేష్ కు మంచి పేరుంది. కార్డియాలజిస్టుగా ఆయన అనేక మందికి సేవలందించారు కూడా. గత ముప్పయి ఏళ్ల నుంచి రమేష్ ఆసుపత్రి కోస్తాంధ్ర ప్రజలకు సుపరిచితమే.

జాతీయ స్థాయిలో చర్చ కావడంతో…..

అయితే స్వర్ణ ప్యాలెస్ లో దుర్ఘటన జరిగింది. ఇందులో రమేష్ ఆసుపత్రి కోవిడ్ సెంటర్ ను నిర్వహిస్తుంది. కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగి పది మంది చనిపోవడంతో జాతీయ స్థాయి ప్రచారం వచ్చింది. ప్రధాని మోదీ, రాష్ట్రపతి, అమిత్ షా వంటి వారు సయితం ఫోన్ లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో ప్రభుత్వం ఈ ప్రమాద ఘటనను సీరియస్ గా తీసుకుని విచారణ కమిటీనినియమించింది. విచారణ కమిటీ తప్పంతా రమేష్ ఆసుపత్రిదేనని తేల్చి చెప్పింది.

రమేష్ పై ముద్ర ఉండటంతో…..

దీనికి ప్రధాన కారణం డాక్టర్ రమేష్ టీడీపీకి సానుభూతిపరుడంటున్నారు. ఇటీవల చంద్రబాబు కోవిడ్ వారియర్స్ తో నిర్వహించిన సమావేశంలో పాల్గొని రమేష్ ప్రసంగించారు. దీంతో పాటు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్చెన్నాయుడు తన పిటీషన్ లో రమేష్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని పిటీషన్ లో కోరారు. దీంతో రమేష్ టీడీపీికి దగ్గర మనిషని తేలింది.

నేరుగానే దిగిన టీడీపీ…..

తొలినాళ్లలో టీడీపీ రమేష్ ఆసుపత్రి వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ గుంటూరు, కృష్ణాజిల్లాల్లో నేతలకు వత్తిడి పెరిగింది. దీంతో చంద్రబాబు కు రమేష్ ఆసుపత్రిపై కులముద్ర వేసి వేధింపులకు దిగుతున్నారని చంద్రబాబుకు చెప్పడంతో అప్పుడు ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. నిజానికి అంతకు ముందు రమేష్ ఆసుపత్రికి ఆరోగ్య శ్రీ బిల్లులను ప్రభుత్వం చెల్లించింది. కానీ టీడీపీ వ్యక్తి అని డాక్టర్ రమేష్ కు ముద్రపడటంతోనే వేధిస్తుందని టీడీపీ ప్రచారం చేస్తుంది. వైసీపీ మాత్రం కులంతో సంబంధం లేకుండా ప్రమాదానికి కారణమైన వారిపైనే ప్రభుత్వం కేసులు పెడుతుందని చెబుతోంది. మొత్తం మీద రెండు పార్టీల మధ్య జరుగుతున్న వార్ లో డాక్టర్ రమేష్ బుక్కయ్యారన్నది వాస్తవం.

Tags:    

Similar News