నిస్సహాయత ఆవరిస్తే… ?

మన ఇల్లో, స్థలమో, పొలమో అప్పుడప్పుడూ కబ్జాకు గురవుతూ ఉంటాయి. వేరే బలవంతుడైన వ్యక్తి లేదా సదరు వ్యక్తి అనుయాయులు మనదనుకునే దాన్ని ఆక్రమించేస్తారు. ఏమీ చేయలేని [more]

Update: 2020-08-16 05:00 GMT

మన ఇల్లో, స్థలమో, పొలమో అప్పుడప్పుడూ కబ్జాకు గురవుతూ ఉంటాయి. వేరే బలవంతుడైన వ్యక్తి లేదా సదరు వ్యక్తి అనుయాయులు మనదనుకునే దాన్ని ఆక్రమించేస్తారు. ఏమీ చేయలేని నిస్సహాయతలో సదరు వ్యక్తిని, అనుయాయుల్ని తిట్టేస్తాం. ఆ తర్వాత మౌనంగా రోదిస్తూ శాపనార్ధాలు అందుకుంటాం.
“దేవుడున్నాడు. అన్నీ చూస్తుంటాడు” అనుకుంటాం.
“దేవుడు నాకెందుకిలా చేశాడు” అని కూడా అనుకుంటాం\
“చస్… దేవుడు లేడు” అని సముదాయించుకుంటాం.
స్థిమితపడాలని చూస్తాం.
అయినా మనసులో బాధ, ఆవేదన ఒకపట్ఠాన స్థిమితంగా ఉండనివ్వవు.
అసంతృప్తి రగిలి శాపనార్ధాలు మొదలెడతాం. …
“వాడికి రోగం వచ్చి పొడా”
“వాడికి ఆక్సిడెంటు అవ్వకపోతదా”
“ఆ కుటుంబం రోడ్డున పడకపోతదా”
“వాడికి పక్షవాతం వచ్చి కాళ్ళు, చేతులు పడిపోకపోతాయా”
“ఏ కేసులోనో పోలీసులు జైలుకు పంపక పోతారా”
ఇలా చాలా చాలానే అనుకుంటాం.
మనది అనుకునేది మనకు కాకుండా పోయిందనే ఆవేదన
ప్రతిగా మనం ఏమీ చేయలేకపోతున్నామనే నిస్సహాయత.
సరిగ్గా చిన్నయసూరి నీతి చంద్రికలో ఇదే చెప్పాడు.
ద్రాక్షపళ్ళకోసం విశ్వప్రయత్నాలు చేసిన నక్క చివరికి ఆ పళ్ళు అందక నిరుత్సహంతో, నిరాశతో వెనుతిరిగి పోతూ
“ఏ గాలిదుమ్మో వచ్చి చెట్టు కూలిపోకపోతుందా”
“భూకంపం వచ్చి చెట్టు భూగర్భంలోకి పోకపోతుందా”
అంటూ అనేకానేక శాపనార్ధాలు పెట్టి… చివరికి …
“ఆ ద్రాక్ష పళ్ళు పుల్లనివి. అవి నాకెందుకు”
అని స్థిమితపడుతుంది.
అలా స్థిమిత పడితే పర్లేదు.
దిగమింగుకుని ఓ మంచిరోజు రాకపోతుందా అని ఆశతో
ఎదురు చూస్తూ గడిపేయవచ్చు.
కానీ స్తిమితపడలేకపోతే. రాజీపడలేకపోతే?
జీవితకాలం శాపనార్ధాలు పెడుతూనే,
ఏదో ఒక చెడు జరగకపోతుందా అని ఎదురు చూస్తూ బ్రతికేస్తాం.
ఏదైనా అంతే…
మనది అనుకున్నది మనది కాకుండా పొతే,
అది దక్కించుకునే అవకాశం లేకపోతే
నక్కే కాదు మనిషి కూడా శాపనార్ధాలు పెట్టాల్సిందే.

(నోట్: కోవిడ్ ని జయించ వచ్చు. నిస్సాయస్థితిలోకి వెళ్ళొద్దు. ముందుముందు మంచిరోజులున్నాయి)

గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News