హీరో నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయు విద్యార్థులు

బిగ్ బాస్ 3 షో లో నాగార్జున పాల్గొంటున్నందున. షో నుంచి నాగార్జున తప్పుకోవాలని ఓయు విద్యార్థులు డిమాండ్ చేశారు ..బిగ్ బాస్ 3 షో వివాదం [more]

Update: 2019-07-20 07:32 GMT

బిగ్ బాస్ 3 షో లో నాగార్జున పాల్గొంటున్నందున. షో నుంచి నాగార్జున తప్పుకోవాలని ఓయు విద్యార్థులు డిమాండ్ చేశారు ..బిగ్ బాస్ 3 షో వివాదం అయిన నేపథ్యంలో నాగార్జున ఇంటిని ముట్టడించినట్లు పోలీసులు తెలిపారు . గత మూడు రోజుల నుంచి నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని ఓయు విద్యార్థులు ప్రకటనల చేశారు. ఈ నేపథ్యంలో నాగార్జున ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ..ఇవాళ ఉదయం నుంచి విద్యార్థులు వస్తున్నారన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

నాగార్జున ఇంటి వైపు సాధారణ వ్యక్తులను ఎవరిని కూడా పోలీసులు పంపించడంలేదు.. ఓయూ కు చెందిన కొంతమంది విద్యార్థులు నాగార్జున ఇంటి వద్దకు చేరుకున్నారు ఇంటి వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.. బిగ్ బాస్ 3 షో నుంచి నాగార్జున తప్పుకోవాలని డిమాండ్ చేశారు.. ఈ షోలో కాస్టింగ్ కౌచ్ లేదని నాగార్జున ప్రకటన చేసిన తర్వాతనే బిగ్ బాస్ షో లో పాల్గొనాలని డిమాండ్ చేశారు.. ఓయూ విద్యార్థుల నిరసన నేపథ్యంలో నాగార్జున ఏం చేస్తాడు ? ఇప్పటికే బిగ్ బాస్ షో షూటింగ్ ప్రారంభమైంది ..అయితే నాగార్జున ఈ షో మీద స్పష్టమైన ప్రకటన ఏమైనా చేస్తారా ..అన్న దానిపైన కొంత ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News