ఓఎల్ఎక్స్ ను కూడా నిషేధించాల్సిందేనా?

టిక్ టాక్ భారత్ లో ఇది కుర్ర కారు నుంచి పండు ముసలి వాళ్ళ వరకు జోష్ నింపిన యాప్. అయితే చైనా తో ఏర్పడిన సరిహద్దు [more]

Update: 2020-07-22 09:30 GMT

టిక్ టాక్ భారత్ లో ఇది కుర్ర కారు నుంచి పండు ముసలి వాళ్ళ వరకు జోష్ నింపిన యాప్. అయితే చైనా తో ఏర్పడిన సరిహద్దు వివాదం మొత్తం 59 యాప్ లను ఒకే దెబ్బతో ఇండియా నిషేధించింది. దీనికి ప్రత్యామ్నాయంగా భారతీయ యాప్ లు కొన్ని ఉద్భవించాయి. వీటిలో కొన్నిటికి టిక్ టాక్ తరహాలోనే ఆదరణ నెమ్మదిగా లభించడం మొదలైంది. ఇది ఒకరకంగా మంచి పరిణామమే. మేక్ ఇన్ ఇండియా కల ఇప్పుడు సాకారం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్న టాక్ వినవస్తుంది.

ఇది కూడా నిషేధించండి …

ఇప్పుడు భారత్ లో ఓ ఎల్ ఎక్స్ కి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అయితే టిక్ టాక్ లాగే దీనిపై కూడా నిషేధం విధించండి బాబు అంటున్నారు పోలీసులు. వివిధ రాష్ట్రాల్లో ఈ యాప్ ద్వారా మోసపోతూ పోలీసులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. దాంతో ఈ యాప్ ను నిషేధిస్తే మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నది ఖాకీల వాదన. అయితే ఈ యాప్ ద్వారా లావాదేవీలు బ్రహ్మాండంగా సాగిస్తున్న వారి సంఖ్యా బాగానే ఉంది.

మంచి ఉంది చెడు ఉంది …

దళారి లేకుండా పైసా ఖర్చు కూడా వేరే వారికి పెట్టకుండా ఓఎల్ఎక్స్ ద్వారా అన్ని రకాల వస్తువుల క్రయ విక్రయాలు సాగుతున్నాయి. వినియోగదారులు తమ వస్తువులను అమ్మకం లేదా కొనుగోలు సమయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం, ఆన్ లైన్ వ్యవహారాలు కాకుండా వస్తువును వెళ్ళి స్వయంగా పరిశీలించుకోవడం వంటివి చేసుకుంటే మోసాలకు చెక్ పడుతుందని కొందరు అంటుంటే మరికొందరు అమాయకత్వం, నిరక్ష్య రాస్యత కారణంగా చాలామంది యాప్ వల్ల మోసపోతున్నారని చెబుతున్నారు. మరి కేంద్రం వివిధ రాష్ట్రాల పోలీసుల విజ్ఞాపన ఏ మేరకు పరిశీలిస్తుందో చూడాలి.

Tags:    

Similar News