బాబు వ్యూహం ఏంటి ?

ఏపీలో ఓడలు బళ్ల‌య్యాయి. బ‌ళ్లు ఓడ‌ల‌య్యాయి. క‌నీసం 20 ఏళ్ల‌పాటు ప్ర‌భుత్వంలో ఉండాల‌ని భావించిన చంద్ర‌బాబు.. ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం కాగా.. ఒక్క ఛాన్స్ అంటూ.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన [more]

Update: 2019-06-15 07:30 GMT

ఏపీలో ఓడలు బళ్ల‌య్యాయి. బ‌ళ్లు ఓడ‌ల‌య్యాయి. క‌నీసం 20 ఏళ్ల‌పాటు ప్ర‌భుత్వంలో ఉండాల‌ని భావించిన చంద్ర‌బాబు.. ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం కాగా.. ఒక్క ఛాన్స్ అంటూ.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన జ‌గ‌న్ భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇక ఇప్పుడు తాజాగా అసెంబ్లీ ప్రారంభ‌మైంది. ప్రొటెం స్పీక‌ర్ స‌భ్యుల‌తో ప్ర‌మాణాలు చేయించే కార్య‌క్ర‌మం ముగిసింది. ఒక‌రిద్ద‌రు మిగిలి ఉంటే.. వారితో త‌ర్వాతైనా చేయించే వెసులుబాటు ఉంటుంది. సో.. మొత్తానికి ఘోర ఓట‌మి త‌ర్వాత నారా చంద్రబాబునాయుడు కొద్దిగా తేరుకున్న‌ట్టు క‌నిపించినా.. లోలోన మాత్రం సీఎం సీటును జ‌గ‌న్ ఆక్యుపై చేయ‌డం మాత్రం ఆయ‌న ఇంకా త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి.

ఇక‌, అసెంబ్లీలో ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు ఒక ప‌క్క‌, కేవ‌లం ఫార్టీ ఇయ‌ర్స్ ఎబౌ వ‌య‌సున్న జ‌గ‌న్ సీఎంగా కొలువుదీరిన స‌భ‌లో టీడీపీ ఎలా వ్య‌వ‌హ‌రించ‌నుంది? పార్టీ త‌న అనుభ‌వాన్ని వినియోగించి ప్ర‌భుత్వానికి సాయం చేస్తుందా? లేక ప‌స‌లేని విమ‌ర్శ‌లు చేసి పొద్దు పుచ్చుతుందా? అనేది ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొలువుదీరి ప‌ది రోజులు కూడా కాకుండానే అప్పుడే విమ‌ర్శ‌లు ప్రారంభించేశారు టీడీపీ నాయ‌కులు. ముఖ్యంగా తాము గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ అమ‌లు చేయాల‌ని పిలుపుని వ్వ‌డం, ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం వంటివి వివాదానికి దారితీస్తున్నాయి.

ఇక‌, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని టీడీపీ నాయ‌కులు ఇప్ప‌టికే మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రాబోయే రోజుల్లో వైసీపీతో క‌లిసి ముందుకు న‌డిచే ప్ర‌తిప‌క్షంగా కాకుండా.. కేవ‌లం దూకుడుగానే ముందుకు వెళ్లే ప్ర‌తిప‌క్షంగా భావించాల్సి వ‌స్తోంది. వాస్త‌వానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఆరు మాసాలు గ‌డువు ఇవ్వాల‌ని ముందుగానే నిర్ణ‌యించుకున్నా.. జ‌గ‌న్ దూకుడు, ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న పాజిటివ్ దృక్ఫ‌థం వంటివి గ‌మ‌నించాక.. చంద్ర‌బాబు వ్యూహం మార్చుకున్నారు. దీనికి కార్య‌క‌ర్త‌ల‌పై దాడిని అడ్డు పెట్టుకుని, నేరుగా జ‌గ‌న్‌పై దాడికి సిద్ధ‌మ‌వ్వాల‌ని నాయ‌కులు, శ్రేణుల‌కు సూచించారు.

ఈ క్ర‌మంలోనే నిన్న మొన్న‌టి వ‌ర‌కు మౌనం వ‌హించిన కుటుంబ‌రావు వంటివారు తెరమీదికి వ‌చ్చి విమ‌ర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఈ ప‌రిణామం చూస్తే.. నిర్మాణాత్మ‌క ప్ర‌తిప‌క్షం క‌న్నా వివాదాస్ప‌ద ప్ర‌తిప‌క్షంగా మారే యోచ‌న‌లో టీడీపీ ఉండడం గ‌మ‌నార్హం. మ‌రోవైపు జ‌గ‌న్ మాత్రం ప్ర‌తి విష‌యంలోనూ ప్ర‌తిప‌క్షాల‌కు విమ‌ర్శ‌లు చేసే ఛాన్స్ ఇవ్వ‌కుండా ముందుకు వెళుతున్నారు.

Tags:    

Similar News