దారి దొరుకుతుందా…?

డీఎల్ ర‌వీంద్రారెడ్డి. క‌డ‌ప జిల్లా మైదుకూరుకు చెందిన కీల‌క నాయ‌కుడు. సుదీర్ఘ రాజ‌కీయ ప్రస్థానం సొంతం చేసుకున్న వివాద ర‌హిత నేత‌. కాంగ్రెస్‌లో ఉన్నస‌మ‌యంలో మంత్రిగా కూడా [more]

Update: 2019-07-21 06:30 GMT

డీఎల్ ర‌వీంద్రారెడ్డి. క‌డ‌ప జిల్లా మైదుకూరుకు చెందిన కీల‌క నాయ‌కుడు. సుదీర్ఘ రాజ‌కీయ ప్రస్థానం సొంతం చేసుకున్న వివాద ర‌హిత నేత‌. కాంగ్రెస్‌లో ఉన్నస‌మ‌యంలో మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆ యన కాంగ్రెస్‌తో విభేదించారు. కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే చివరి నిమిషంలో డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఆయ‌న ఫ్యూచ‌ర్ ఏంటి? అనే ప్రశ్న తెర‌మీ దికి వ‌స్తోంది. విష‌యంలోకి వెళ్తే.. కాంగ్రెస్‌లో చ‌క్రం తిప్పిన మైదుకూరు నాయ‌కుడు డీఎల్ ర‌వీంద్రారెడ్డి.

తనకంటూ ఒక వర్గాన్ని…..

మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి డీఎల్ ర‌వీంద్రారెడ్డి వ‌రుస విజ‌యాలు సాధించి రికార్డు సృష్టించారు. వైఎస్ ప్రభుత్వం త‌ర్వాత ఏర్పడిన కిర‌ణ్ కుమార్ రెడ్డి స‌ర్కారులో ఆయ‌న మంత్రి ప‌ద‌విని కూడా నిర్వహించారు. రాజ‌కీయాల్లో మేధావిగా గుర్తింపు పొందారు. ఎక్కడా ఎలాంటి వివాదాల‌కు తావు లేకుండా, అవినీతి ర‌హితంగా ఆయ‌న వ్యవ‌హ‌రించారు. త‌న‌కంటూ.. ప్రత్యేక వ‌ర్గాన్ని, నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కంటూ ప్రత్యేక ఓటు బ్యాంకును సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌ను డీఎల్ ర‌వీంద్రారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్‌తో అంటీ ముట్టన‌ట్టు వ్యవ‌హ‌రించారు.

టీడీపీలో చేరాలనుకున్నా…

అదే స‌మ‌యంలో విభ‌జ‌న త‌ర్వాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంపై డీఎల్ ర‌వీంద్రారెడ్డి మ‌క్కువ పెంచుకున్నారు. చంద్రబాబు పిలిస్తే.. వెళ్లి సైకిల్ ఎక్కాల‌ని కూడా నిర్ణయించుకున్నారు. అయితే, ఒకానొక ద‌శ‌లో బాబు డీఎల్ ర‌వీంద్రారెడ్డికి ఆహ్వానం పంపాల‌ని నిర్ణయించు కున్నారు. అయితే, రాజ‌కీయంగా మైదుకూరులో నేత‌ల ఒత్తిడి ఎక్కువ‌గా ఉండ‌డంతో బాబు సాహ‌సం చేయ‌లేక పోయారు. దీంతో డీఎల్ ర‌వీంద్రారెడ్డికి ఆహ్వానం అంద‌లేదు. ఇక‌, ఈ క్రమంలోనే ఓపిక న‌శించిన డీఎల్ ర‌వీంద్రారెడ్డి వైసీపీ వైపు చూశారు. ఇదిలావుంటే, త‌న‌ను పార్టీలోకి తీసుకుంటాన‌ని వేగుల ద్వారా క‌బురుపెట్టిన బాబు.. త‌ర్వాత మౌనం వ‌హించ‌డంపై డీఎల్ ర‌వీంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ ఆదరిస్తారా…?

త‌న‌ను పార్టీలోకి తీసుకుంటాన‌ని చెప్పి.. బాబు ఎలాంటి నిర్ణయ‌మూ తీసుకోకపోవ‌డంతో ఆయ‌న టీడీపీకి యాంటీ అయ్యారు. ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న టీడీపీకి వ్యతిరేకంగా, వైసీపీ అభ్యర్థి శెట్టిప‌ల్లి ర‌ఘురామిరెడ్డికి అనుకూలంగా మైదుకూరులో చ‌క్రం తిప్పారు. వైసీపీ అభ్యర్థి త‌ర‌ఫున ప్రచారం నిర్వహించారు. ఫ‌లితంగా మైదుకూరులో పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ఓడిపోయి.. వైసీపీ విజ‌యం సాధించింది. ఇక‌, ఎన్నిక‌ల త‌ర్వాత మ‌ళ్లీ డీఎల్ మౌనం వ‌హించారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయ‌న‌కు జ‌గ‌నే ఏదో ఒక దారి చూపించాల‌ని అంటున్నారు డీఎల్ అనుచ‌రులు. ఎన్నిక‌ల్లో కోర‌క‌పోయినా.. సాయం చేసి, వైసీపీ నాయ‌కుడు గెలిచేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లిన డీఎల్ ర‌వీంద్రారెడ్డిని ఆద‌రించాల‌ని కోరుతున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News