ఆ సీట్లలో పోటీకి సై అంటున్న అధికారులు..!

ఎన్నికలు వస్తున్నాయంటే కొత్త ముఖాలు ఎన్నో తెరపైకి వచ్చేస్తాయి. అందుకో సీనియర్ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ ల వంటి వారు కూడా ఉంటారు. అన్ని రంగాల వారికి [more]

Update: 2019-01-19 06:30 GMT

ఎన్నికలు వస్తున్నాయంటే కొత్త ముఖాలు ఎన్నో తెరపైకి వచ్చేస్తాయి. అందుకో సీనియర్ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ ల వంటి వారు కూడా ఉంటారు. అన్ని రంగాల వారికి చివరి అవకాశంగా రాజకీయమే కనిపిస్తోంది. అన్నీ సమకూర్చుకుని మరీ రాజకీయంలో తమ జాతకం పరీక్షించుకుందామని వస్తున్నారు. వారిని రాజకీయ పార్టీలు కూడా బాగానే ఆహ్వానిస్తున్నాయి. విశాఖ జిల్లాలో ఇపుడు పొలిటికల్ ఎంట్రీకి కొంతమంది అధికారులు, రిటైర్డు అయిన వారు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ నుంచి వారు అరంగ్రేట్రం చేసేందుకు రెడీ అవుతున్నారు.

అరకు ఎంపీగా

విశాఖ జిల్లా ఏజెన్సీ అరకు పార్లమెంట్ సీటుకు ఇపుడు ఓ ఐఏఎస్ అధికారి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయన విశాఖలోని జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటున్నారు. విశాఖలోనే గతంలో ఉడా వైస్ చైర్మన్ గా కూడా పనిచేసిన అయాన పేరు బాబూరావు నాయుడు. ఆయనది విశాఖ జిల్లా పాడేరు కావడం విశేషం. దాంతో అధికార టీడీపీ ఆయన్ని దువ్వుతోందని టాక్. ఆయన సైతం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. గిరిజన ప్రాంతానికి చెందిన ఆయన కడపకు కలెక్టర్ గా కూడా పనిచేశారు. మంచి అధికారిగా ఉన్న ఆయన్ని పోటీలో పెడితే విజయావకాశాలు బాగా ఉంటాయని టీడీపీ భావిస్తోందట.

వైసీపీలో కూడా

ఇక వైసీపీ నుంచి చూసుకున్నపుడు పాయకరావుపేట అసెంబ్లీ సీటుకు పోటీ గట్టిగా ఉంది. ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పోటీ చేసి గెలిచారు. ఆయన వైఎస్సార్ టైంలో రాజకీయ ప్రవేశం చేశారు. ఆయన సైతం విశాఖ జిల్లా పరిషత్ ముఖ్య అధికారిగా పనిచేసిన వారే. ఆయనతో పాటుగా కొత్తగా చేరిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రేంబాబు కూడా వైసీపీ టికెట్ అడుగుతున్నారు. ఆయన ఆర్ధికంగా బలంగా ఉండడంతో పాటు తనకు ఉన్న సామజిక సంబంధాలను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఇక మరో అభ్యర్ధిగా విశాఖ కేజీహెచ్ కి చెందిన సీనియర్ డాక్టర్ బంగారయ్య పేరు కూడా వైసీపీలో వినిపిస్తోంది. ఆయన సైతం తాను అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అవుతానని అంటున్నారు. ఇక టీడీపీలో ఎంపీ సీటు కోసం సాలూరుకి చెందిన ఓ బ్యాంక్ అధికారి కూడా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అదే విధంగా మరికొంతమంది అధికారులు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి రెండు పార్టీల తరఫున సిధ్ధపడుతున్నారని భోగట్టా. మరి ఎవరికి టికెట్ దక్కుతుందో, గెలిచి ఎవరు ప్రజా ప్రతినిధులు అవుతారో చూడాలి.

Tags:    

Similar News