చెన్నై ఇప్పట్లో బయటపడేటట్లులేదే?

దేశంలో నగరాలన్నీ కరోనా వ్యాధితో వణికి పోతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ నగరాల్లోనే విజృంభిస్తుంది. ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ వంటి నగరాలు వైరస్ కేసులతో [more]

Update: 2020-05-03 18:29 GMT

దేశంలో నగరాలన్నీ కరోనా వ్యాధితో వణికి పోతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ నగరాల్లోనే విజృంభిస్తుంది. ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ వంటి నగరాలు వైరస్ కేసులతో విలవిలలాడుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నై నగరం కూడా ఇందుకు మినహాయింపు కాదు. తమిళనాడు దేశంలో అత్యధిక కేసులు ఉన్న ఏడో రాష్ట్రంగా ఉంది. మహారాష్ట్ర, , గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ తర్వాత స్థానం తమిళనాడుదే.

చెన్నై నగరంలోనే…..

తమిళనాడులో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేలు దాటింది. చెన్నై నగరంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. దాదాపు 800 కేసులు నగరంలోనే ఉన్నాయి. చెన్నై నగరం అతి పెద్దది కావడం, దాదాపు కోట్ల మంది జనాభా ఉండటంతో వైరస్ తో వణికిపోతుంది. నాలుగు రోజుల క్రితం 121 కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయితే అందులో చెన్నై నగరంలోనే 103 కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది.

నిత్యావసర వస్తువులకు….

ఇప్పటికే చెన్నై కు నలువైపుల రహదారులను మూసి వేశారు. ఎవరినీ చెన్నై నగరంలోపలకి అనుమతించడం లేదు. నగరం నుంచి బయటకు పంపడం లేదు. దీంతో పాటు చెన్నై నగరంలో మంచినీటి సమస్య కూడా తీవ్రమయింది. దీంతో అక్కడక్కడా ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. కంటెయిన్ మెంట్ ప్రాంతాల్లో నిత్యావసరవస్తువులు కూడా దొరకడం లేదు. దీంతో స్పందించిన ప్రభుత్వం చెన్నై నగరంలో ప్రజలకు సౌకర్యాలను కల్పించడానికి ప్రత్యేక అధికారులను నియమించింది.

లింకు దొరకడం లేదే?

మరో ముఖ్యమైన అంశం ఏంటంటే? చెన్నై నగరంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులకు లింకు దొరకడం లేదు. వీరికి వైరస్ ఎలా సోకిందో నిర్ధారించలేకపోతున్నారు. మర్కజ్ మసీదు నుంచి వచ్చిన వారు కాకుండా బయట వ్యక్తులకు వైరస్ సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చెన్నై నగరంలో వైరస్ మూడో దశకు చేరుకుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కమ్యునిటీ ట్రాన్స్ మిషన్ కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద చెన్నై నగరం వైరస్ తో వణికిపోతుంది. ఎప్పుడు బయటపడుతుందనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు.

Tags:    

Similar News