అప్రమత్తం కాకుంటే … మరింత ముదిరిపోనుందా?

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఊహించ‌ని దానిక‌న్నా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో క‌రోనా కేసుల సంఖ్య 143కు పెరిగిపోయింది. నిజానికి దేశంలో ఎక్కడా లేని విధంగా [more]

Update: 2020-04-03 02:00 GMT

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఊహించ‌ని దానిక‌న్నా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో క‌రోనా కేసుల సంఖ్య 143కు పెరిగిపోయింది. నిజానికి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించారు. తొలుత ఉద‌యం ఆరు నుంచి మ‌ద్యాహ్నం 1 గంట వ‌ర‌కు రిలాక్సేష‌న్ ఇచ్చారు. ఫ‌లితంగా ప్రజ‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వారి దైనందిన కార్యక్రమాల‌కు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అయితే జనం ఒక్కసారిగా ఎక్కువగా వస్తుండటతో దానిని ఏపీలో ఉదయం 6 గంటల నుంచి 9గంటల వరకు కుదించారు.

చేయి దాటిపోయే…..

ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చిన వారివ‌ల్ల ఇబ్బంది లేద‌ని అనుకున్నా.. ఇప్పుడు రా ష్ట్రంలో ప‌రిస్థితి చేయి దాటే ప్రమాదం పొంచి ఉంద‌నేది నిపుణుల మాట‌. ప్రధానంగా మర్కజ్ మసీద్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇది ఒకింత ప్రభుత్వంలోనూ, ప్రజల్లోనూ ఆందోళన కల్గిస్తుంది. ఏపీ నుంచి దాదాపు వెయ్యి మందికి పైగానే నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చారు.

అనేక మంది కోసం…..

వీరిలో ఐదు వందలకు మంది పైగా గుర్తించి ఇప్పటికే వారిని క్వారంటైన్ చేశారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తుండటంతో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. వీరి కోసం సెర్చ్ కొనసాగుతోంది. దీంతో లాక్ డౌన్ ను కూడా ఇక ఏపీలో కఠినతరం చేయాలని నిర్ణయించారు. అనవసరంగా రోడ్ల మీదకు వస్తే వాహనాలను సీజ్ చేస్తున్నారు. రెండేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశముందని హెచ్చరికలను ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయనున్నారు.

చిన్న పట్టణాలకు సయితం…..

జగన్ ప్రభుత్వం ముందు నుంచి చర్యలు తీసుకుంటున్నా ప్రస్తుతం నమోదయిన 143 కేసుల్లో దాదాపు 120కి పైగా కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. మొన్నటి వరకూ పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు సెమీ పట్టణాలకు కూడా విస్తరించడంతో మరింత ఆందోళన కలుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు కూడా సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. లేకుంటే ఏపీలో కరోనా వైరస్ మరింత విజృంభించే అవకాశముంది.

Tags:    

Similar News