సిద్ధూ సింగిల్ గానే

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒంటరి వాడయ్యారు. సిద్ధరామయ్య పై నిన్నటి వరకూ మిత్రపక్షంగా వ్యవహరించిన జనతాదళ్ ఎస్ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నా కాంగ్రెస్ నేతలు [more]

Update: 2019-08-26 17:30 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒంటరి వాడయ్యారు. సిద్ధరామయ్య పై నిన్నటి వరకూ మిత్రపక్షంగా వ్యవహరించిన జనతాదళ్ ఎస్ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నా కాంగ్రెస్ నేతలు అండగా నిలవడం లేదు. దీనికి కారణంగా పార్టీలో సిద్ధరామయ్యపై తీవ్ర వ్యతిరేరకత ఉన్నట్లు చెప్పకనే తెలుస్తోంది. సిద్ధరామయ్య ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు లబ్ది పొందిన నేతలు సయితం ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు.

మాజీ ముఖ్యమంత్రికి….

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జనతాదళ్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొనసాగి రికార్డు సృష్టించారు. తరచూ ముఖ్యమంత్రులను మార్చే కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్య విష‍యంలో ఆ పనిచేయలేకపోయింది. ఎందుకంటే సిద్ధరామయ్య బలమైన నేత కావడం ఇందుకు కారణం. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు అనుకూలురు కావడంతోనే అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా సాఫీగా కొనసాగారు.

మనసు అంగీకరించకున్నా…..

ఇక మొన్నటి ఎన్నికల్లో సిద్ధరామయ్య చాముండేశ్వరి నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అక్కడ జనతాదళ్ ఎస్ కు చెందిన జీటీ దేవెగౌడ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి సిద్ధరామయ్య జేడీఎస్ అంటే మరింత ఆగ్రహంగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఏర్పాటయిన సంకీర్ణ సర్కార్ లో కుమారస్వామి ముఖ్యమంత్రి అయినా సిద్ధరామయ్య కాదనలేకపోయారు. మనసు అంగీకరించకపోయినా హైకమాండ్ సూచనలకు తలొగ్గారు.

ఏ కాంగ్రెస్ నేత…..

అయితే ముఖ్యమంత్రి కుమారస్వామి అప్పట్లో ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్, మంత్రి డీకే శివకుమార్ లను దగ్గరకు తీశారు. సిద్ధరామయ్య సమన్వయ కమిటీ ఛైర్మన్ గా ఉన్నప్పటికీ ఆయనను లెక్క చేయకుండా కుమారస్వామి నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా కుమారస్వామి, దేవెగౌడలు సిద్ధరామయ్యపై విరుచుకుపడుతున్నా కాంగ్రెస్ నేతలు నోరు మెదపడం లేదు. దీనికి కారణంహైకమాండ్ సూచనలేనన్న అనుమానం కలుగుతోంది. సిద్ధరామయ్య కారణంగా మిత్రపక్షమైన జేడీఎస్ ను దూరం చేసుకోకూడదన్న కారణంతోనే సిద్ధరామయ్యకు ఎవరూ మద్దతుగా నిలబడటం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీలోనూ సిద్ధరామయ్య సింగిల్ అయ్యారన్న అనుమానాలున్నాయి.

Tags:    

Similar News