కట్టడి కాకుంటే మరోసారి లాక్ డౌన్ తప్పదా?

కరోనాను ఇప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత ప్రజలతో పాటు పాలకులు కూడా కోరోనాను మర్చిపోయినట్లే కన్పిస్తుంది. అసలు రోడ్ల మీద [more]

Update: 2020-06-23 09:30 GMT

కరోనాను ఇప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత ప్రజలతో పాటు పాలకులు కూడా కోరోనాను మర్చిపోయినట్లే కన్పిస్తుంది. అసలు రోడ్ల మీద చూస్తుంటే కరోనా ఉన్నట్లే కన్పించడం లేదు. మరోవైపు ప్రజలు కూడా పూర్తిగా భౌతిక దూరం అనే మాటను మరిచిపోయారు. కూరగాయలు, మాంసం మార్కెట్ల వద్ద చూస్తుంటే కరోనా వైరస్ అనేది ఉందా? అన్న అనుమానం కలగక మానదు.

రోజురోజుకూ కేసుల సంఖ్య….

తాజాగా ఆంధ్రప్రదేశ్ ను తీసుకుంటే రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఏపీలో ఎనిమిదివేేల కేసులు దాటిపోయాయి. రోజుకు రెండు వందల నుంచి నాలుగు వందల వరకూ కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. మిగిలిన రాష్ట్రాలైన తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర వంటి వాటితో పోల్చుకుంటే కొంత తక్కువగానే కన్పిస్తున్నా భవిష్యత్తులో మాత్రం ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మినహాయింపుల తర్వాత….

లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లోకేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఇప్పుడు కాంటాక్ట్ కేసులను కూడా గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా ఈ వ్యాధి సోకుతున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్ సోకుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది.

లాక్ డౌన్ విధిస్తారా?

ఇప్పటి వరకూ ఏపీలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య వంద దాటింది. ప్రధానంగా కర్నూలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే ఒంగోలు లాంటి నగరంలో లాక్ డౌన్ ను మళ్లీ విధించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజలు ప్రభుత్వానికి సహకరించకపోతే ఏపీలో అనేక జిల్లాల్లో లాక్ డౌన్ ను విధించే అవకాశాలున్నాయని అధికారులు అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.

Tags:    

Similar News