భీష్మ మూవీ రివ్యూ

భీష్మ మూవీ రివ్యూ బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్ నటీనటులు: నితిన్, రష్మిక మందన్న, వెన్నెల కిషోర్, సత్య, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, అనంత్ నాగ్ [more]

Update: 2020-02-21 08:58 GMT

భీష్మ మూవీ రివ్యూ
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: నితిన్, రష్మిక మందన్న, వెన్నెల కిషోర్, సత్య, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, అనంత్ నాగ్ తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: సూర్యదేవర నాగ వంశి
దర్శకత్వం: వెంకీ కుడుములు

గుండెజారి గలంతయ్యిందే, ఇష్క్ సినిమాల్తో బౌన్స్ బ్యాక్ అయిన హీరో నితిన్ కి లై, చల్ మోహన రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు వరసగా షాకివ్వడంతో.. నితిన్ కాస్త కంగారు పడినా.. చలో దర్శకుడు వెంకీ కుడుముల చెప్పిన కథకి కనెక్ట్ అయ్యాడు. శ్రీనివాస కళ్యాణం ప్లాప్ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న నితిన్ చలో దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి భీష్మ అనే కమర్షియల్ ఎంటెర్టైనెర్ చేసాడు. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయో ట్రైలర్‌లో చూపించారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సేంద్రియ వ్యవసాయం అనే అంశాన్ని కూడా కథలో భాగం చేయడంతో ఆసక్తి మరింత పెరిగింది. క్యూట్ అండ్ హిట్ హీరోయిన్ రష్మిక హీరోయిన్ గా నటించడం, ట్రైలర్ అండ్ సాంగ్స్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. మూడు ప్లాప్స్ తర్వాత భీష్మ నితిన్ కి హిట్ ఇచ్చిందా? వరస హిట్స్ కొడుతున్న రష్మిక కి భీష్మ కూడా హిట్ కట్టబెట్టిందా…? చలో తో హిట్ కొట్టి రెండో సినిమా భీష్మ తో వెంకీ కుడుములు ఏం చేసాడో? అనేది భీష్మ సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
వ్యవసాయ రంగానికి చెందిన భీష్మ ఆర్గానిక్ కంపెనీ ద్వారా మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సీఈఓ అనంత్ నాగ్ సరికొత్త పద్దతులను ప్రవేశ పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అయితే వీరికి పోటీగా క్రిమినల్ మైండెడ్ మరో కార్పొరేట్ కంపెనీ హెడ్ అయిన రాఘవన్(జిష్షు) అడ్డుపడుతుంటాడు.మరోవైపు, భీష్మ(నితిన్) డిగ్రీ డిస్ కంటిన్యూ చేసి హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. గర్ల్ ఫ్రెండ్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అలాంటి టైమ్‌లో అనుకోకుండా చైత్ర (రష్మిక)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే, భీష్మ(నితిన్) స్టేటస్ వల్ల రష్మిక తండ్రి (సంపత్) వాళ్ళ ప్రేమను ఒప్పుకోడు. కొన్ని ఊహించని పరిణామాల ద్వారా నితిన్ భీష్మ ఆర్గానిక్ కంపెనీ భాద్యతలు చేపడతాడు.అలా చేపట్టాక నితిన్ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి?జిష్షును ఎలా ఆపగలిగాడు?తాను అలా మారడానికి గల కారణం ఏమిటి అన్నవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

నటీనటులు:
నితిన్ తనదైన కామెడీ టైమింగ్,ఎమోషన్స్ రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్ లోను అదరగొట్టేసాడు. నితిన్ వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కి కూడా సరిగ్గా అద్దినట్టు సరిపోవడంతో ఎక్కడా తడబడకుండా హ్యాపీగా ఇన్వాల్వ్ అయ్యి నటించాడు. ఇక నితిన్ కామెడీ కూడా ఆకట్టుకుంది. నితిన్ ఇప్పటివరకు చేసిన సినిమాలో కామెడీ టైమింగ్ అద్భుతంగా పండించిన సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు. లవ్ సీన్స్‌లో కూడా నితిన్ నటన చాలా సహజంగా ఉంది. అలాగే రష్మిక మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింది. అలాగే గ్లామర్ పరంగాను రష్మిక కొత్తగా కనబడింది. ముఖ్యంగా నితిన్ – రష్మిక ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. అలాగే సినిమాలో మరో మెయిన్ కేరక్టర్ జిష్షు గుప్త పాత్ర. నటన పరంగా జిష్ణు 100 మార్కులు వేయించుకున్నాడు. జిష్ణు మరోసారి టాలీవుడ్ లో మంచి హాట్ టాపిక్ అవుతాడని చెప్పాలి. వెన్నెల కిషోర్, రఘుబాబు పాత్రలు కామెడీ పండించాయి. మిగతా నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:
నితిన్ కి అ…ఆ.. తర్వాత మల్లి ఆ రేంజ్ హిట్ పడలేదు. లై హిట్ అనుకుంటే.. కలెక్షన్స్ రాలేదు. అలాగే చల్ మోహన్ రంగ దెబ్బేసింది. శ్రీనివాస కళ్యాణం సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా హిట్ అనుకుంటే.. అది ఫట్ అయ్యింది. దానితో కాస్త గ్యాప్ తీసుకుని నితిన్ చలో హిట్ కొట్టిన వెంకీ కుడుములు చెప్పిన భీష్మ కథకి కనెక్ట్ అవడంతో…. సినిమాని పట్టాలెక్కించాడు. వెంకీ సెకండ్ సినిమాకి కూడా సింపుల్ కథనే ఎంచుకున్నాడు. ఒక కమర్షియల్ సినిమా నుండి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో ఆయా అంశాలను మేళవిస్తూ, ఆద్యంతం వినోదాత్మకంగా ఉండేలా ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకోవడంతోనే సగం సక్సెస్ అయ్యాడు. పాటలతో మంచి క్రేజ్ ను తెచ్చుకున్న ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ ఏదో అలా సాగినట్టు అనిపిస్తుంది. మరీ గొప్పగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ప్రతీ ఆర్టిస్టు మంచి నటనతో అలాగే ఆలోచింపజేసే కథనంతో మెల్లగా కొనసాగుతుంది. ట్రైలర్ తోనే కథ తాలూకా థీమ్ ఏమిటి అన్నది రివీల్ చేసేసిన దర్శకుడు సినిమా చూస్తున్నంతసేపు దానిని మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే బావుండేది.ఇలా ఫస్టాఫ్ అంతా ఓకె అనిపించే నరేషన్ తో కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడక్కడా ఆకట్టుకునే కామెడీ మరియు ఇంటర్వెల్ లో చోటు చేసుకునే చిన్న ట్విస్ట్ సినిమాకి మెయిన్ హైలెట్ అనేలా ఉంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే ఫస్టాఫ్ తో పోల్చితే సెకండాఫ్ లో అన్ని అంశాల మోతాదును దర్శకుడు పెంచేశారని చెప్పాలి.ముఖ్యంగా కామెడీ సీన్స్ ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయి.ఇలా కామెడీ మాత్రం సెకండాఫ్ లో మంచి ఎస్సెట్ గా నిలుస్తుంది.ఛలో చిత్రంతో వెంకీ చేసిన మ్యాజిక్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యిందని చెప్పాలి.అలాగే సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మరియు నితిన్, కేజీయఫ్ ఫేమ్ నటుడు అనంత్ నాగ్ ల మధ్య వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్,అలాగే ఆసక్తికరంగా మారే కథనాలు బాగున్నాయి. సెకండాఫ్ పై పెట్టిన శ్రద్ద ఫస్టాఫ్ పై మిస్సయినట్టు క్లియర్ గా తెలుస్తుంది.

సాంకేతికంగా
మ్యూజిక్ డైరెక్టర్ మహతి అందించిన పాటలు బావున్నాయి. సినిమా విడుదలకు ముందే భీష్మ పాటలు హిట్ అయ్యాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్ గా బాగున్నాయి. అలాగే సినిమాకి మరో మెయిన్ హైలెట్ సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ చిత్రీకరణ కానివ్వండి అన్ని రిచ్ గా చూపించాడు. ఇక ఎడిటింగ్ లో చిన్న కత్తెర వేయాల్సిన సీన్స్ ఉన్నాయి. అవి లేకుండా బావుండేదనిపిస్తుంది. నిర్మాతలు సినిమాకి అందించిన నిర్మాణ విలువలు బావున్నాయి.

రేటింగ్: 2.75/5

Tags:    

Similar News