నితీష్ కు మైనస్ మార్కులు… అందువల్లనే?

కరోనా విజృంభిస్తున్నా భారత్ లో రాజకీయాలకు ఏమాత్రం కొదవలేదు. అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. కరోనా ఇంకా ఎంతకాలం ఉంటుందో? తెలియదు. ఎన్నికలు మాత్రం ముంచుకొస్తున్నాయి. ముఖ్యంగా [more]

Update: 2020-04-30 17:30 GMT

కరోనా విజృంభిస్తున్నా భారత్ లో రాజకీయాలకు ఏమాత్రం కొదవలేదు. అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. కరోనా ఇంకా ఎంతకాలం ఉంటుందో? తెలియదు. ఎన్నికలు మాత్రం ముంచుకొస్తున్నాయి. ముఖ్యంగా త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో రాజకీయాలు మరీ ఎక్కువగా కన్పిస్తున్నాయి. బీహార్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే బీహార్ లో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందనే చెప్పాలి.

కూటములపై క్లారిటీ…..

బీహార్ లో ఇప్పటికే కూటములపై క్లారిటీ వచ్చింది. బీజేపీ, జనతాదళ్ యులు కలసి ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. దీనిపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. సీట్ల పంపకం కూడా దాదాపుగా జరిగిపోయినట్లే. అలాగే రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్ లు కలసి పోటీ చేయనున్నాయి. ఈ పార్టీలు ఇంకా సీట్ల విష‍యంలో ఒక నిర్ణయం రాకపోయినప్పటికీ కలసి పోటీ చేయడం ఖాయం. ఎందుకంటే వారికి అంతకంటే మరో ఆప్షన్ లేదు.

కరోనా ఎఫెక్ట్ పెద్దగా లేకున్నా….

ఇక కరోనా మహమ్మారి బీహార్ ను పెద్దగా పట్టుకోలేదు. అయితే ఒక సమస్య మాత్రం బీహార్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసింది. బీహార్ కు చెందిన వలస కార్మికులు, విద్యార్థులు లక్షల సంఖ్యలో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వీరిని వెనక్కు రప్పించడంలో నితీష్ ప్రభుత్వం విఫలమయిందని ఆర్జేడీ నేతలు ఆరోపిస్తున్నారు. నితీష్ కుమార్ కూడా ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు.

వలస కార్మికుల విషయంలో….

విద్యార్థులను తీసుకురావడంలో చూపిన శ్రద్ధ వలస కార్మికులను పంపండంలో ఆదిత్యనాధ్ చూపడం లేదని ఆక్షేపించారు. ఇప్పుడు ఆర్జేడీ వలస కార్మికుల విషయంలో నితీష్ కుమార్ చూపిన నిర్లక్ష్యాన్ని పెద్దయెత్తున ప్రజల్లోకి తీసుకెళుతోంది. వలస కార్మికులను బీహార్ సర్కార్ పట్టించుకోవడం లేదని, నితీష్ కుమార్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ యాగం కూడా నిర్వహించడం విశేషం. ఇలా బీహార్ లో కరోనాను కట్టడి చేయగలిగినా నితీష్ కుమార్ కు వలస కార్మికుల విష‍యంలో మాత్రం మైనస్ మార్కులు పడ్డాయనే చెప్పాలి.

Tags:    

Similar News