బీహార్ బచ్ గయా..? ఎలా సాధ్యమైంది?

బీహార్ మనం అన్ని విషయాల్లో వెనకబడి ఉందని చెబుతాం. బీహార్ నిజంగా అన్ని రంగాల్లో వెనుకబడింది నిజమే. అయితే కరోనా వైరస్ కట్టడి విషయంలో మిగిలిన రాష్ట్రాలకంటే [more]

Update: 2020-04-08 17:30 GMT

బీహార్ మనం అన్ని విషయాల్లో వెనకబడి ఉందని చెబుతాం. బీహార్ నిజంగా అన్ని రంగాల్లో వెనుకబడింది నిజమే. అయితే కరోనా వైరస్ కట్టడి విషయంలో మిగిలిన రాష్ట్రాలకంటే ముందంజలో ఉంది. 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. 40 పార్లమెంటు స్థానాలున్నాయి. పెద్దదే కాకుండా పేద రాష్ట్రమైన బీహార్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా కన్పిస్తుంది. ఇప్పటి వరకూ బీహార్ లో కరోనా పాజిటివ్ కేసులు 32 మాత్రమే నమోదయ్యాయి. వీటిలో రెండు మరణాలు సంభవించాయి.

పేద రాష్ట్రం.. పదికోట్ల మంది….

బీహార్ లో పదికోట్ల మంది ప్రజలు ఉన్నారు. నేపాల్ సరిహద్దు రాష్ట్రమిది. పశ్చిమబెంగాల్ ను కూడా ఆనుకుని ఉంటుంది. ఇక్కడ ముస్లిం జనాభా కూడా అధికంగానే ఉంటుంది. పూర్తిగా వెనకబడిన రాష్ట్రమైన బీహార్ లో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తొలి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రధానంగా మధ్యనిషేధాన్ని అమలు పర్చారు.

మర్కజ్ కు హాజరయిన వారిని….

ఢిల్లీలో జరిగిన మర్కజ్ మసీదు ప్రార్థనలకు బీహార్ నుంచి అతి తక్కువ మంది హాజరయ్యారు. అయితే వీరిని వెంటనే గుర్తించిన ప్రభుత్వం వెంటనే క్వారంటైన్ కు తరలించింది. అయితే గత పదిహేను రోజులుగా లాక్ డౌన్ విషయంలో నితీష్ కుమార్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. బీహార్ లో ఏ ఆంక్షలు అమలు కావన్న నానుడిని తుడిచిపెట్టేస్తూ బీహార్ పోలీసులు లాక్ డౌన్ సమయంలో ప్రజలెవ్వరూ బయటకు రానివ్వకుండా కఠిన చర్యలు చేపట్టారు.

కట్టుదిట్టమైన చర్యలతో కట్టడి….

ఇతర రాష్ట్రాల సరిహద్దులను కూడా వెంటనే మూసివేయడంతో కొంత కట్టడి చేయగలిగింది. పేదలు ఎక్కువగా ఉండటంతో వారికి నిత్యవసరాల పంపిణీ తక్షణమే చేపట్టారు. కూరగాయల వంటి వాటిని ఇళ్లకే చేర్చారు. స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో నితీష్ కుమార్ పునరావస శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. ఉత్తర్ ప్రదేశ్, జార్ఖంఢ్, నేపాల్ ప్రాంతంనుంచి వచ్చిన వలస కార్మికుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇలా పెద్ద, పేద రాష్ట్రమైన బీహార్ లో కరోనాను కట్టడి చేయడంలో నితీష్ కుమార్ ముందున్నారనే చెప్పాలి.

Tags:    

Similar News