బేరాల్లేవు… బెదిరింపులు లేవ్

ఈ ఏడాది అక్టోబర్ చివరివారంలో లేదా నవంబరు మొదటి వారంలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు అగ్నిపరీక్ష కానున్నాయి. అధికార జనతాదళ్ (యు) అదినేత [more]

Update: 2020-03-06 16:30 GMT

ఈ ఏడాది అక్టోబర్ చివరివారంలో లేదా నవంబరు మొదటి వారంలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు అగ్నిపరీక్ష కానున్నాయి. అధికార జనతాదళ్ (యు) అదినేత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు, ఆయన సంకీర్ణ సర్కారులోని భారతీయ పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. లాలుా ప్రసాద్ యాదవ్ సారద్యంలోని విపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), లాలుా మిత్రపక్షమైన కాంగ్రెస్ కు కుాడా ఈ ఎన్నికలు ముఖ్యమే. బీహార్ కు సంబంధించి రాజకీయంగా ఒక విచిత్ర పరిణామం ఉంది. కేంద్రంలోని జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండుా రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలైన జనతాదళ్, ఆర్జేడీల పై ఆధారపడి రాజకీయం చేస్తున్నాయి. ఏ విధంగా చుాసినా ఈ ఉత్తరాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకమని పేర్కొ నవచ్చు.

గెలిచిన ఊపు మీద ఉన్నా…..

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారధ్యంలోని జనతాదళ్ యు మళ్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. దాని మిత్రపక్షమైన భాజపా ఇప్పటికే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భంగ పడి ఉంది. ఈ నేపద్యంలో గతంలో మాదిరిగా కాకుండా అధికారంలో ఉన్న ముాడో రాష్ట్రాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. పశుదాణా కుంభకోణం కేసులో జైలుపాలయిన లాలూ పార్టీ మనుగడకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కీలకం. నాలుగో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఉనికిని కాపాడుకునేందుకు నానా పాట్లు పడాల్సి ఉంటుంది. అన్నింటికన్నా కమలం పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకమని చెప్పడంలో అతి శయోక్తిలేదు. వాస్తవానికి 2015 ఎన్నికల్లో అధికారం చేపడతామని బీరాలు పలికిన బాజాపా 54 స్ధానాలకు పరిమితమైంది. అంతకు ముందు ఏడాది 2014 లోక్ సభ ఎన్నికల్లో విజయఢంకా మెాగించింది. ఆ ఊపుతో ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న కమలానికి తలబొప్పిక ట్టింది. ఇక గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లోనుా 17 స్దానాలను గెలుచుకున్న బీజేపీ ధీమాగా ముందుకు వె‌ళ్లింది.

జూనియర్ భాగస్వామిగానే….

కానీ ఇటీవలి మహారాష్ట్ర , ‍హర్యానా, జార్ఖండ్, తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవాలను చవిచుాసిన కమలనాధులు సంయమనం ప్రదర్శిస్తున్నారు. ఎంతమాత్రం దుాకుడుగా వ్యవహరించడంలేదు. ఇటీవల వివిధ రాష్ట్రాల అసెం‍బ్లీ ఎన్నికల్లో గెలిచి ఉంటే కమలం పార్టీ తీరే వేరుగా ఉండేది. నితీశ్ కుమార్ ను లెక్క చేయకుండా ముందుకు వెళ్లేది. కానీ పరిస్ధితి తెలియడంతో కమలనాధులు బింకం ప్రదర్శించడంలేదు. నితీశ్ కుమార్ తోనే ఎన్నికలను ఎదుర్కొంటామని అగ్రనేత అమిత్ షా ప్రకటించారు. రాష్ట్రం నుంచి కేవలం అయిదుగురు మంత్రులున్నప్పటికీ వారు పార్టీని గట్టెక్కించే పరిస్దితి లేదు. రవిశంకర్ ప్రసాద్, అనిల్ కుమార్ చౌబే, నిత్యానందరాయ్, గిరిరాజ్జ్ సింగ్ రాష్ట్రం నుంచి కేంధ్రమంత్రులుగా ఉన్నారు. బిజెపి మిత్రపక్షమైన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) గత లోక్ సభ ఎన్నికల్లో ఆరు స్థానాలను గెలుచుకుంది. ఆ పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కేంద్రమంత్రిగా ఉన్నారు. వివిధ రాష్టాల్లో వరుస ఓటముల కారణంగా నితీశ్ తో సీట్ల విషయమై బేరసారాలు జరిపే పరిస్దితిలో బీజేపీ లేదు. నితీశ్ కుమార్ ఇచ్చినన్ని సీట్లు తీసేకోవడం తప్ప డిమాండ్ చేసే పరిస్థితి లేదు. అంటే జుానియర్ భాగస్వామిగా కొనసాగాల్పిన పరిస్థితి. దీనికితోడు గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 17 స్దానాలను గెలుచుకుంది. అందువల్ల నితీశ్ కుమార్ కుాడా సీట్ల విషయంలో మెుండిగా వ్యవ‍హరించే అవకాశం ఉంది. అందువల్ల బీహార్ ఎన్నికల్టో బీజేపీ పార్టీ నామ మాత్రమేనని చెప్పడం అతిశయెాక్తి కానే కాదు.

వీటి పరిస్థితి అంతే…

ఇక ఆర్జేడీ, కాంగ్రెస్ పరిస్దితి మరింత దయనీయంగా ఉంది. గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు చావుదెబ్బతిన్నాయి. కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితంకాగా, ఆర్జేడీ అసలు బోణీ చేయలేదు. వాస్తవానికి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 80 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయినప్పటికీ ముందుగా కుదిరిన ఒప్పందం మేరకు సీఎం పీఠం అప్పగించింది. నాటి ఎన్నికల్లో నితీశ్ కుమార్, కాంగ్రెస్, లాలుా పార్టీలు కలసి పోటీ చేశాయి. బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. కాల క్రమంలో నితీశ్ ఆర్జేడీ కి దూరమై బీజేపీతో పొత్తు పెట్టుకొని పదవిని కాపాడుకున్నారు. దాణా కుంభకోణాల కేసులో లాలూ జైలుపాలవ్వడం, కుటుంబ కలహాల కారణంగా ఆర్జేడీ కొంత వెనకబడి ఉంది. లాలుా ఇద్దరు కొడుకుల మద్య సఖ్యత లేదు. ఒక కొడుకు భార్యకు విడాకులు ఇచ్చారు. అష్టకష్టాల్లో ఉన్న ఆర్జేడీ కి ఈ ఎన్నికలు లత్యంత కీలకం. 2015 లో 26 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ తన ఉనికి కాపాడుకుంది. ఈసారి వాటిని నిలబెట్టుకుంటే గొప్పే. మొత్తానికి బీహార్ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకం కానున్నాయి.

 

ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News