నిమ్మలకు బయట ఉన్నది ఇంట్లో లేదా?

ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యే. పార్టీ ఇంత‌క‌ష్టకాలంలో ఉన్నా కూడా తిరుగులేని దూకుడు చూపిస్తున్నారు. అసెంబ్లీలోను, ఇత‌ర వేదిక‌ల‌పైనా.. ఆ య‌న దూకుడుగా విమ‌ర్శలు చేస్తున్నారు. పార్టీ త‌ర‌ఫున [more]

Update: 2021-05-23 00:30 GMT

ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యే. పార్టీ ఇంత‌క‌ష్టకాలంలో ఉన్నా కూడా తిరుగులేని దూకుడు చూపిస్తున్నారు. అసెంబ్లీలోను, ఇత‌ర వేదిక‌ల‌పైనా.. ఆ య‌న దూకుడుగా విమ‌ర్శలు చేస్తున్నారు. పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ కూడా వినిపిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితి మాత్రం ఆయ‌న‌కు క‌లిసి రావ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌నే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గం.. వాస్తవానికి టీడీపీకి కంచుకోట‌.

టీడీపీకి కంచుకోటగా…..

టీడీపీ ఆవిర్భవించిన త‌ర్వాత‌.. 1983 నుంచి ఇప్పటి వ‌ర‌కు కూడా 1989, 2009 ఎన్నిక‌ల్లో త‌ప్ప.. మిగిలిన అన్ని ఎన్నిక‌ల్లోనూ రాష్ట్రంలో ఎలాంటి రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నా.. టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంటూనే ఉంది. సో.. అలానే 2014, 2019లో ఇక్కడ నుంచి నిమ్మల రామానాయుడు గెలుపు గుర్రం ఎక్కారు. 2014లో కంటే.. 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కడం నిజంగా గ్రేట్‌. ఎందుకంటే. రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీ, వైసీపీ ప‌వ‌నాలు జోరుగా సాగినందున.. హేమాహేమీలు కూడా ఓడిపోయిన నేప‌థ్యంలో నిమ్మల రామానాయుడు విజ‌యం ఖ‌చ్చితంగా రికార్డే..! ఇంత వ్య‌తిరేక గాలిలో కూడా నిమ్మ‌ల ఏకంగా 18 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు.

నియోజకవర్గంలో మాత్రం….

అయితే.. ఈ విష‌యంలో స్థానిక టీడీపీ నేత‌లు మాత్రం.. భిన్నంగా ఉన్నారు. టీడీపీ కంచుకోట కాబ‌ట్టి విజ‌యం సాధించారు.. ఆయ‌న గొప్పేం లేదు! అనే మాట వినిపిస్తోంది. ఇక, నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల‌కు ముందున్న ప‌రిస్థితి ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. నిమ్మల రామానాయుడు వెంట న‌డిచేందుకు కేడ‌ర్ కూడా పెద్దగా ముందుకు రావ‌డం లేదు. దీంతో కొన్ని రోజులు ఒంట‌రిగానే ఓ ప‌ది మందితో పార్టీ త‌ర‌ఫున కార్యక్రమాలు ముగించిన నిమ్మల రామానాయుడు త‌ర్వాత త‌ర్వాత‌.. నియోజ‌క‌వ‌ర్గంలో అయిష్టంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. రాష్ట్ర స్థాయిలో మాత్రం.. ఖ‌చ్చితంగా ఆయ‌న దూకుడు చూపిస్తున్నారు.

లోకల్ లీడర్స్ సహకారం లేక…

ఇటీవ‌ల జ‌రిగిన తిరుప‌తి ఉప ఎన్నిక‌లోనూ.. ఇత‌ర‌త్రా విష‌యాల్లోనూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో అసెంబ్లీలోనూ అనేక మార్లు స‌స్పెండ్ కావ‌డం.. సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శలు చేయ‌డం వంటివి నిమ్మల రామానాయుడును బాగానే ప్రొజెక్టు చేశాయి. అయితే.. నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఏ చిన్న కార్యక్రమం నిర్వహించినా నాయ‌కుల కోసం వెయిట్ చేసే ప‌రిస్థితి వ‌స్తోంది. అంటే.. ఆయ‌న ప‌నులు చేయించ‌డం లేద‌ని బాధో.. లేక మ‌రేదైనానో తెలియ‌దుకానీ.. నేత‌లు మాత్రం స‌హ‌క‌రించ‌డం లేద‌నేది వాస్తవం.

పట్టు కోసం ప్రయత్నాలు….

ఇక జ‌గ‌న్ రామానాయుడిని బాగా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నారు. కీల‌క ప‌ద‌వులు అన్ని పాల‌కొల్లు నేత‌ల‌కే క‌ట్టబెడుతున్నారు. ప్రతిష్టాత్మక‌మైన డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ ప‌ద‌వులు పాల‌కొల్లుకే ఇచ్చిన జ‌గ‌న్ రేపో మాపో ప‌శ్చిమ జ‌డ్పీచైర్మన్ ప‌ద‌వి కూడా ఇదే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ క‌వురు శ్రీనివాస్‌కు ఇస్తున్నారు. దీంతో స్థానిక టీడీపీ నేత‌లు ప‌నులు కావ‌డం లేద‌ని లోపాయికారిగా అధికార పార్టీకి కోప‌రేట్ చేస్తోన్న ప‌రిస్థితి ఉంది. ప‌రిస్థితి గ్రహించిన నిమ్మల రామానాయుడు కూడా రాష్ట్ర స్థాయిలో హైలెట్ అవుతూ ప‌ట్టుకోసం ప్రయ‌త్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News