మరీ ఇంత గందరగోళమా? నష్టపోయేది ఎవరు?

ఏపీలో అక్షరాలా రాక్షస‌ రాజకీయమే సాగుతోంది. లేకపోతే రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టి చోద్యం చూస్తే అతి తెలివితేటలు నేతలు చేయడమేంటి. స్మూత్ గా ఫంక్షనింగ్ [more]

Update: 2020-03-15 15:30 GMT

ఏపీలో అక్షరాలా రాక్షస‌ రాజకీయమే సాగుతోంది. లేకపోతే రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టి చోద్యం చూస్తే అతి తెలివితేటలు నేతలు చేయడమేంటి. స్మూత్ గా ఫంక్షనింగ్ జరగాల్సిన వ్యవస్థలపైన జనాలకు నమ్మకం పోతోంది. అంతే కాదు, చివరకు ప్రజలకు కూడా చేటు జరుగుతోంది. ఏపీలో చూస్తే స్థానిక ఎన్నికలు హఠాత్తుగా వాయిదా వేశారు. ఇది ప్రభుత్వానికి తెలియకుండా తీసుకున్న చర్య అంటున్నారు. అంటే అత్యంత వివాదాస్పద చర్యగా దీన్ని చూడాలి.

అయిదువేల కోట్ల మాటేంటి…?

ఏపీకి తాను సీఎంగా ఉన్నపుడు చంద్రబాబు ఎన్నికలు జరిపించలేదు. ఆనాడు ఆయన ఫక్తు రాజకీయమే చూసుకున్నారు. ఇపుడు కూడా అదే చేస్తున్నారు. దీనివల్ల 14వ ఆర్ధిక సంఘం నిధులు నిలిచిపోతాయి. అయిదు వేల కోట్ల రూపాయలు వస్తే పల్లెలు వెలుగుతాయి. పట్నాలు కూడా ప్రగతి బాట పడతాయి. అందుకే హడావుడిగా ఎన్నికలు జరిపిస్తోంది ఏపీ సర్కార్. ఎన్నికలకు మేము సదా సిధ్ధమని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పినపుడు కూడా కరోనా వైరస్ దేశంలో ఉంది. మరో వారం పది రోజులు ఆగితే ఎన్నికలు పూర్తి అవుతాయి. ఇపుడు ఏపీలో వైరస్ తాకిడి కూడా పెద్దగా లేదు. అయినా సరే ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా రాజ్యాంగబధ్ధ వ్యవస్థల పట్ల రమేష్ కుమార్ నమ్మకం లేకుండా చేశారనుకోవాలి. అంతే కాదు, వేల కోట్ల నిధులు ఏపీకి నష్టం కలిగించాడనుకోవాలి.

ఈసీ మీద యుధ్ధం…..

ఇక ఈసీ మీద యుధ్ధం అని జగన్ అంటున్నారు. నిన్నటి దాకా శాసనమండలి రద్దు తో అక్కడ రాజ్యాంగ రచ్చ ఒక లెవెల్లో జరిగింది. మండలి, అసెంబ్లీకి మధ్య చిచ్చు రగిలించింది కూడా ఈ కుట్ర రాజకీయమే. ఇలా ఒకరి మీద మరొకరు పై చేయి సాధించాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్న పనుల కారణంగా చివరకు వ్యవస్థల మధ్య సంక్షోషభం తలెత్తుతోంది. ఇది దారుణం. బాధాకరమే అవుతుంది. ఏపీలో చూసుకుంటే జగన్, చంద్రబాబు వ్యక్తిగత స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారనిపిస్తోంది. దాని వల్ల ఏపీ ఆర్ధికంగా, పాలనాపరంగా కూడా ఇబ్బందులో పడుతోంది.

టెన్త్ పరీక్షలు….

మరో వైపు లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టెన్త్ పరీక్షలు రద్దు చేశారు. ఇపుడు 31వ తేదీ నుంచి వారికి పరీక్షలు ఉన్నాయి చూస్తే అవి ఇపుడు సజావుగా జరుగుతాయా అన్న డౌట్లు వస్తున్నాయి. చిన్నారులు ఇలా రాజకీయ వివాదాల్లో ఇరుక్కుపోతున్నారు. జగన్ పోరాటం చేసి ఎన్నికల షెడ్యూల్ ని ముందుకు తెచ్చినా టెన్త్ పరీక్షలకు ఇబ్బందే. ఒక వేళ ఇపుడు అనుకుంటున్నట్లుగా మేలో ఎన్నికలు పెడితే మాత్రం ఏప్రిల్లో జరగాల్సి ఉంది. అయితే రాజకీయాలు రాజుకున్న వేళ లోకల్ బాడీ ఎన్నికలు ఎపుడు అవుతాయో తెలియని పరిస్థితి ఉంది. దాంతో టెన్త్ పరీక్షలు కూడా డౌట్లో పడుతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News