నిమ్మగడ్డ ఒంటికాలి మీద లేస్తోంది?

ఒక ఐఏఎస్ అధికారి. నిష్పక్షాతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి. ఐఏఎస్ గా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రజల సొమ్మును జీతభత్యాలుగా తీసుకుంటున్న వ్యక్తి. మరి ఎవరికి [more]

Update: 2020-12-14 12:30 GMT

ఒక ఐఏఎస్ అధికారి. నిష్పక్షాతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి. ఐఏఎస్ గా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రజల సొమ్మును జీతభత్యాలుగా తీసుకుంటున్న వ్యక్తి. మరి ఎవరికి జవాబుదారీగా ఉండాలి. ప్రజలకా? ప్రభుత్వానికా? ప్రతిపక్షానికా? ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సోషల్ మీడియా సాక్షిగా పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. సాఫీగా పోయేదానిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనంతట తానే తెచ్చి నెత్తిమీదపెట్టుకున్నారంటున్నారు.

ఎన్నికల వాయిదాను….

మార్చిలో కరోనా వైరస్ సూచనలు కన్పించిన వెంటనే ఎన్నికలు వాయిదా వేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. ప్రజల కోసమే చేశారని అందరూ భావించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయి, ఏకగ్రీవాలు కూడా కొన్ని చోట్ల జరిగిన తర్వాత కనీసం ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా వాయిదా వేయడంతోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం దృష్టిలో విలన్ గా మారారు. నిజానికి అప్పుడే ఆయనను ప్రభుత్వాన్ని సంప్రదించి ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదు.

ఇప్పుడు జరపాలన్నా…..

ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ప్రభుత్వానికి బంధం పూర్తిగా తెగిపోయింది. ఆయనపై టీడీపీ ముద్ర బలంగా పడిపోయింది. ఆయన ఉన్న కాలంలో ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా విపక్ష టీడీపీ చెప్పినట్లే నడుచుకుంటున్నాడన్న దానికి ఆయన వ్యవహార శైలి కారణమని చెప్పకతప్పదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభుత్వంతో సయోధ్యతతో మెలిగి తన కార్యం చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి సవాల్ గా మారితే ప్రజలు కూడా ప్రభుత్వం వైపే ఉంటారనడంలో ఎటువంటి సందేహంలేదు.

రాజ్యాంగ నిబంధనలను గురించి…

రాజ్యాంగ నిబంధలను గురించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మట్లాడటం విడ్డూరంగా ఉంది. సరైన సమయంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని రాజ్యాంగం పేర్కొందని చెప్పడాన్ని ఎద్దేవా చేస్తున్నారు. 2018 లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సి ఉండగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు జరపలేదన్న ప్రశ్న వస్తుంది. అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుదలకు పోకుండా, ఉన్న కాస్తా పరువును పోగొట్టుకోకుండా తన పదవీ కాలం పూర్తయిన వెంటనే దిగిపోతేనే బెటర్. లేకుంటే వరస అవమానాలు, చీత్కారాలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తప్పవు. మార్చి వరకూ ఆయన కాలక్షేపం చేసి వెళ్లడమే మంచిదన్న సూచనలు కూడా వినవస్తున్నాయి.

Tags:    

Similar News