ఇద్దరూ ఇద్దరే.. ఎవరూ తగ్గడం లేదు…?

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇది ఇప్పట్లో ముగిసేలా కన్పించడం లేదు. ఎత్తుకు [more]

Update: 2021-01-30 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇది ఇప్పట్లో ముగిసేలా కన్పించడం లేదు. ఎత్తుకు పై ఎత్తులతో ఇద్దరూ పంతానికి పోతుండంటంతో మధ్యలో అధికారులు నలిగిపోతున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు ఉండటంతో దానికి ధీటుగా సమాధానం చెప్పేలా ప్రభుత్వం ప్రతి చర్యలు ఉంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏ నిర్ణయం ఇరువైపుల నుంచి వెలువడుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

నిమ్మగడ్డ చర్యలకు ధీటుగా….

తొలుత నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్ లపై అభిశంసన చేయాలంటూ సిఫార్సు చేశారు. అయితే దీనికి ధీటుగా ప్రభుత్వం కూడా స్పందించింది. అభిశంసన చేసే అధికారం లేదంటూ తిరిగి చీఫ్ సెక్రటరీ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంతటితో ఊరుకోలేదు. సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీని ఎన్నికల వఇదుల నుంచి తప్పించాలని లేఖ రాశారు. దీనికి ప్రవీణ్ ప్రకాష్ కూడా ధీటుగా వివరణ ఇచ్చారు.

ఏకంగా గవర్నర్ కు…..

ఇక రాజకీయంగా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పదవి నుంచి తొలగించాలని గవర్నర్ కు సిఫార్సు చేశారు. దీనిపై రాష‌్ట్ర అడ్వొకేట్ జనరల్ సలహా తీసుకునే కంటే అటార్నీ జనరల్ సలహా తీసుకోవాలని గవర్నర్ కు సూచించడం విశేషం. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మాటల దాడిని వైసీపీ నుంచి ఆగడం లేదు.

మాటల దాడితో…..

నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు తొత్తు అని సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ఘాటుగా విమర్శించారు. ఆయన ఎన్నికల కమిషనర్ గా పనికి రారని, నిమ్మగడ్డను ఎర్రగడ్డలో చేర్పించాలని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సయితం తనపై విమర్శలు చేసే కొద్దీ ఆయన తన చర్యలతో ప్రభుత్వానికి, వైసీపీకి ఇబ్బందికరంగా మారారు. ఆయనను నిలువరించడానికి విమర్శలతో ప్రతిదాడికి దిగుతుంది వైసీపీ. మొత్తం మీద రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్, ప్రభుత్వానికి మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు.

Tags:    

Similar News