నిమ్మగడ్డ ట్రోల్ అవుతుంది అందుకేనా?

ఏపీ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశం పెట్టి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు చేయగానే ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. [more]

Update: 2020-03-16 03:30 GMT

ఏపీ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశం పెట్టి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు చేయగానే ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. జగన్ మీడియా సమావేశం పెట్టిన తర్వత వరసగా మంత్రులు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టార్గెట్ చేశారు. కుల ప్రస్తావనలు తీసుకువచ్చారు. దీంతో వైసీపీ సోషల్ మీడయాలో నిమ్మగడ్డపై అనేక రకాల వ్యాఖ్యానాలు విన్పించాయి. కన్పించాయి.

ఆయన వివరణను….

నిమ్మగడ్డ రమేష‌ కుమార్ 2016లో చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించారు. ఆయన చంద్రబాబు సామాజిక వర్గానికి చెందడం వల్లనే టార్గెట్ అయ్యారన్నది స్పష్టంగా తెలుస్తోంది. తాను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్నికలు వాయిదా వేశానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతున్న వివరణను కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకే తాను ఎన్నికల వాయిదా వేశానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతున్నారు.

ఎవరితో సంప్రదించకుండా…..

అయితే ఎన్నికలను వాయిదా వేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాల్సింది. కానీ అలా చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్లనే నిమ్మగడ్డ రమేష‌ కుమార్ విమర్శలను ఎదుర్కొంటు న్నారు. ఆరు వారాల పాటు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పడు అన్ని రాజకీయ పార్టీలతో కూడా ఆయన చర్చించాల్సి ఉందన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి.

కూతురు శరణ్యను….

దీనికితోడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుమర్తెను కూడా ఈ వివాదంలోకి లాగారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుమార్తె శరణ్యను చంద్రబాబు తాను అధికారంలో ఉండగా కీలక పదవిలో నియమించారు. ఆర్థిక అభివృద్ధి మండలిలో అసోసియేట్ డైరెక్టర్ గా నియమించి నెలకు రెండు లక్షల జీతం చెల్లంచారు. టీడీపీ అధికారం కోల్పోగానే శరణ్య రాజీనామా చేశారు. నిమ్మగడ్డకు ఇలా చంద్రబాబు సాయం చేయడం వల్లనే ఆయన స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో టీడీపీ ఒత్తిడికి తలొగ్గారని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. మొత్తం మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొందరపాటు నిర్ణయం ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

Tags:    

Similar News