నిమ్మగడ్డ అలా దిగిపోయిన వెంటనే?

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎవరు అంటే ఇపుడు అంతా ఇట్టే చెప్పేస్తారు. గూగుల్ సెర్చ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. అంతలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ [more]

Update: 2021-01-19 02:00 GMT

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎవరు అంటే ఇపుడు అంతా ఇట్టే చెప్పేస్తారు. గూగుల్ సెర్చ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. అంతలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరు గడించారు, చాలా బాగా పాపులర్ కూడా అయ్యారు. 151 సీట్లతో కడు బలంగా కనిపించిన జగన్ సర్కార్ తో పోరాడడం ఎలా అన్నది తెలియక అసెంబ్లీలో నానా ఇబ్బందులు పడుతున్నారు రాజకీయ దిగ్గజం చంద్రబాబు. కానీ ఏ రాజకీయ అనుభవం లేకపోయినా కూడా జగన్ ప్రభుత్వాన్ని మూడు చెరువుల నీరు తాగించేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అతి కొద్ది నెలలు మాత్రమే పదవీ కాలం ఉన్నా కూడా నిమ్మగడ్డ వారి దూకుడు ఎక్కడా తగ్గడంలేదు.

పాఠాలు నేర్చారా ?

మొత్తానికి జగన్ కి తొలి ఏడాదిలోనే నిమ్మగడ్డ మాస్టార్ మంచి పాఠాలే నేర్పారు అని అంటున్నారు. నిజనికి ఎన్నికల సంఘం ప్రధానాధికారి పదవి విషయంలో ఇప్పటిదాకా ఎవరూ పెద్దగా ఆలోచించినది లేదు. రాజ్యాంగబద్ధమైన ఆ పదవి విషయంలో చంద్రబాబు కూడా పెద్దగా కసరత్తు చేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని నియమించారని అనుకోవడానికి లేదు. కానీ గత ఏడాది అనుభవాలు చూస్తే ఆ పదవి ఎంతటి పవర్ ఫుల్ అన్న సంగతి అనుభవ పూర్వకంగా జగన్ కి తెలిసింది. దాంతో కొత్త అధికారిని ఈసారి చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారని అంటున్నారు.

ఆమెకే ఆ పదవి….

ఈ మధ్యనే ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన నీలం సాహ్ని కి ఈ అత్యంత కీలకమైన పదవిని కట్టబెట్టడానికి జగన్ సిధ్ధంగా ఉన్నారని అంటున్నారు. ఆమెను సీఎస్ గా ఏరి కోరి తెచ్చుకున్న జగన్ ఆమె పదవీ కాలాన్ని ఎక్స్ టెన్షన్ కూడా కొన్ని సార్లు చేయించారు. ఇపుడు ఆమె సీఎం కి ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. అయితే అది టెంపరరీ సర్దుబాటు మాత్రమేనని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో ఆమె కొత్త ఎస్ఈసీగా వస్తారని అంటున్నారు. ఆమె జగన్ సర్కార్ కి సీఎస్ గా అన్ని విధాలుగా సహకరించారన్నది ఇక్కడ ప్రస్తావనార్హం.

ఆచీ తూచీ ….

ఇక ఎన్నికల సంఘం అధికారాలుచ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలి ఏంటో కళ్లారా చూసిన జగన్ ఇకపైన అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉంటారని అంటున్నారు. ఎవరిని ఈ పదవిలో కూర్చోబెట్టినా కూడా తనకు అనుకూలంగా ఉన్న వారినే చూసుకుంటారని కూడా చెబుతున్నారు. అదే విధంగా ఎన్నో కీలకమైన పదవులు నామినేట్ చేయాల్సిన వేళ కూడా జగన్ ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకున్నది లేదు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుభవంతో ప్రతీ నామినేటెడ్ పదవి విషయంలోనూ కడు జాగ్రత్తలు తప్పక తీసుకుంటారని అంటున్నారు. మొత్తానికి వేస్తే వేప కొమ్మ, తీస్తే అమ్మ వారు లాగా కొన్ని కీలకమైన పదవులు ఉంటాయి. వాటి విషయంలో ఎంతటి జాగరూకతతో వ్యవహరించాలో ఏపీలో కొత్త ప్రభుత్వానికి దాని సారధికి ఇపుడిపుడే అర్ధమవుతోందిట.

Tags:    

Similar News