వారు కాదంటే… ఆయన ఏం చేస్తారు?

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు మరోసారి తన నిర్ణయాన్ని వెల్లడించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు సంప్రదింపులు జరపాలని ఆదేశించింది. మూడు [more]

Update: 2020-12-30 03:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు మరోసారి తన నిర్ణయాన్ని వెల్లడించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు సంప్రదింపులు జరపాలని ఆదేశించింది. మూడు రోజుల్లోగా అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలవాలని కోరింది. అయితే ప్రభుత్వం దీనికి ఎలా స్పందిస్తుంది? ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో చర్చలు జరుపుతారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

కలసి కూర్చుని…..

ఇటు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను, అటు ప్రభుత్వాన్ని కలసి కూర్చుని మాట్లాడుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో ఇప్పుడు ఏం జరుగుతుందనేది చర్చగా మారింది. ప్రభుత్వానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ల మధ్య గత కొంత కాలంగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో జరగాలని అంటున్నారు. జనవరిలోగా ఓటర్ల సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆయన ఇప్పటికే కోరారు.

ప్రభుత్వం మాత్రం….

మరోవైపు ప్రభుత్వం మాత్రం కరోనా వైరస్ కారణంగా ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపలేమని చెబుతోంది. ఏపీ ఎన్జీవోల సంఘం సయితం ఇప్పట్లో స్థానిక సంస్థలు జరపితే తాము ప్రమాదంలో పడతామని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరుపున వచ్చే అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో మళ్లీ పాత పాటే పాడే అవకాశాలున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరపలేమని అధికారులు మరోసారి స్పష్టం చేయనున్నారు.

మళ్లీ అదే చెబితే…..

మరోసారి అధికారులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. తిరిగి ఆయనకు మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం తప్ప మరో దారి లేదు. ఫిబ్రవరి లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటే వచ్చే నెలలో నే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి వాతావరణం లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అధికారాలు పూర్తిగా ఎన్నికల కమిషనర్ వేనని హైకోర్టు స్పష్టం చేయడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News