ఏది అక్కరకు వచ్చిందో….? అదే అడ్డుపడుతుందా?

స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే రెండో రకం కరోనా వైరస్ రావడంతో ఇప్పుడు [more]

Update: 2020-12-28 13:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే రెండో రకం కరోనా వైరస్ రావడంతో ఇప్పుడు ప్రభుత్వానికి ఎన్నికల వాయిదాకు అవకాశం చిక్కినట్లయింది. బ్రిటన్, ఇటలీలో రెండో రకం కరోనా వైరస్ రావడం, ప్రపంచ దేశాలన్నీ వణికిపోతుండటం అందరికీ తెలిసిందే. అయితే ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం అయ్యే అవకాశం కన్పించడం లేదు.

ఎన్నికల నిర్వహణకు….

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. హైకోర్టును కూడా ఆయన ఆశ్రయించారు. తాను మార్చిలో పదవీ విరమణ చేస్తున్నందున ఫిబ్రవరి నెలలోనే ఎన్నికలను నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకుంటున్నా కరోనా ఆయనను ముందు అడుగు వేయనీయడం లేదు.

కరోనా కారణంగానే….

స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుమార్ కరోనా కారణంగానే వాయిదా వేశారు. అయితే అప్పట్లో కేవలం రెండు, మూడు కేసులే ఉన్నప్పటికీ కరోనాను సాకుగా చూపి వాయిదా వేశారు. ప్రభుత్వంతో ఏమాత్రం సంప్రదించకుండా వాయిదా వేయడంతో జగన్ సర్కార్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య ఆరు నెలల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది.

రెండో రకం వైరస్…..

ప్రభుత్వం మాత్రం కరోనా వైరస్ ఉధృతి తీవ్రంగా ఉందని తాము ఎన్నికలను నిర్వహణకు ముందుకు రాలేమని పదే పదే చెబుతుంది. అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం రాజ్యాంగపరంగా ఎన్నికలను నిర్వహించాల్సిందేనని పట్టుబడుతున్నారు. కానీ తాజాగా కొత్తరకం కరోనా వైరస్ రావడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాదన ఇక బలహీనమయిందనే చెప్పాలి. ఇప్పుడు ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించినా ఫలితం ఉండకపోవచ్చు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణలో ఫెయిల్ అవ్వక తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News