నిమ్మగడ్డ గ్యాప్ ఇచ్చి…. మళ్లీ కెలుకుతున్నారుగా?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరు చూస్తుంటే ఆయన ప్రభుత్వంతో అమితుమీకి సిద్ధమయినట్లే కన్పిస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన పక్షంరోజుల పాటు మౌనంగా [more]

Update: 2020-09-03 13:30 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరు చూస్తుంటే ఆయన ప్రభుత్వంతో అమితుమీకి సిద్ధమయినట్లే కన్పిస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన పక్షంరోజుల పాటు మౌనంగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి ప్రభుత్వ తీరుపై మరోసారి హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిబ్బందిని ప్రభుత్వం వేధిస్తుందని, ఎన్నికల కమిషన్ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

భవిష‌్యత్ లో తీసుకోపోయే నిర్ణయాలపై….

అంటే భవిష్యత్తులో తాను తీసుకునే నిర్ణయాలపై ఎటువంటి ప్రభావం పడకుండా ఉండేదుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుగానే న్యాయస్థానాన్ని ఆశ్రయించారంటున్నారు. నిజానికి ఇప్పుడికిప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే కరోనా వైరస్ ఏపీలో ఎక్కువగా ఉంది. రోజుకు పదివేల కేసులకు పైగానే నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణపై ఆయన నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదు.

ఏకగ్రీవాలపైనా…..

దీంతో పాటు గతంలో ఎన్నికలు జరిగినప్పుడు తాను సస్పెన్షన్ కు సిఫార్సు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న దానిపైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నిమ్మగడ్డ రమేష్ కుమర్ ప్రశ్నించే వీలుందంటున్నారు. అలాగే గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన ఏకగ్రీవాలపైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు. గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసే అవకాశముందని కూడా ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి.

ఉన్నతాధికారులతో సమీక్షకు….

అంతే కాకుండా గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తలెత్తిన శాంతిభద్రతల సమస్య పరిస్థిితిపై కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా పోలీసు అధికారులో సమీక్షించేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. అందుకే ముందుగా హైకోర్టును ఆశ్రయించి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా ఒక సంకేతం పంపాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ టీడీపీ ఆఫీసులో తయారయిందని సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్, ల్యాప్ ట్యాప్ లను కూడా ఇప్పించాలని ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు. మొత్తం మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ కెలుక్కుంటున్నారన్న టాక్ అయితే ఉంది.

Tags:    

Similar News