నిమ్మగడ్డ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతారా?

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధకారిగా పునర్నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంతో ఎఫెన్స్ తోనే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుంది. ఆయన నియామకం ఉత్తర్వులు వచ్చిన రోజునే అధికార పార్టీ [more]

Update: 2020-08-03 06:30 GMT

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధకారిగా పునర్నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంతో ఎఫెన్స్ తోనే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుంది. ఆయన నియామకం ఉత్తర్వులు వచ్చిన రోజునే అధికార పార్టీ నేతలపై సుప్రీంకోర్టులో అఫడవిట్ దాఖలు చేయడం ఈ రకమైన సంకేతాలను ఇస్తుంది. అధికార పార్టీ నేతలు రాజ్యాంగ వ్యవస్థలను ఎలా కించపర్చిందీ, తనను ఎలా దూషించిందన్న విషయాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మరో ఎనిమిది నెలలే…..

నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలను తీసుకోబోతున్నారు. అయితే ఆయనకు ఇప్పట్లో పెద్దగా పని ఉండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి. లక్షన్నరకు చేరువలోఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి తో ముగియనుంది. అంటే మరో ఎనిమిది నెలలు మాత్రమే ఆయన ఈ పదవిలో ఉంటారు.

రీ షెడ్యూల్ చేస్తారా?

మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్యలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలపై తాను పదవిలో ఉన్నప్పుడే ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా చోట్ల ఏకగ్రీవమయ్యాయి. అయితే ఈ ఏకగ్రీవ ఎన్నికల మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొద్దికాలంలోనే కీలక నిర్ణయం వెలువరించే అవకాశముంది. ఎన్నికలను తిరిగి రీ షెడ్యూల్ చేసే అవకాశముందంటున్నారు.

అధికార పార్టీపై……

ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అధికార పార్టీ ఎన్నో ఇబ్బందులు పెట్టింది. తనను అన్యాయంగా దూషించడమే కాకుండా, తన లేఖపై సీఐడీ విచారణకు కూడా ఆదేశించింది. తన కుమార్తె విషయంలోనూ విచారణ చేపట్టింది. అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంటున్నారు. ఆయన సుప్రీంకోర్టులో తన అఫడవిట్ లో అధికార పార్టీ నేతలు తనను ఏ విధంగా దూషించింది సాక్ష్యాధారాలతో అఫడవిట్ దాఖలు చేయడం ఇందుకు నిదర్శనమంటున్నారు. మొత్తానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాలు దువ్వడానికే సిద్ధమయ్యారన్న వార్తలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News