నిమ్మగడ్డ ఆనందం 24 గంటలు నిలవలేదే?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో విపక్షాల ఆనందానికి అడ్డులేకుండా పోయింది. గవర్నర్ నిర్ణయాన్ని చంద్రబాబుతో సహా [more]

Update: 2020-07-31 14:30 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో విపక్షాల ఆనందానికి అడ్డులేకుండా పోయింది. గవర్నర్ నిర్ణయాన్ని చంద్రబాబుతో సహా విపక్షాలన్నీ ఆహ్వానించాయి. ప్రభుత్వానికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో గవర్నర్ సానుకూలంగా స్పందించడంతో మూడు రాజధానుల బిల్లులను కూడా గవర్నర్ తిరస్కరిస్తారని విపక్షాలు భావించాయి.

గవర్నర్ నిర్ణయంతో…..

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను గవర్నర్ తిరిగి నియమించిన 24 గంటలు గడవక ముందే మూడు రాజధానుల బిల్లులను ఆమోదించడం విపక్షాలకు మింగుడు పడటం లేదు. దీనిపై చంద్రబాబుతో సహా విపక్షాలన్నీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని తప్పు పడుతున్నాయి. ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నాయి.

న్యాయస్థానాల్లో…..

రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు విపక్షాలు పిలుపునిచ్చాయి. న్యాయస్థానంలో కేసు పెండింగ్ లో ఉండగా మూడురాజధానుల బిల్లులను ఎలా గవర్నర్ ఆమోదిస్తారని ప్రశ్నిస్తున్నాయి. అయితే గవర్నర్ మూడు వారాలుగా న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు. బిల్లుల్లో లోటు పాట్లను ఆయన పరిశీలించారు. ఫైనల్ గా న్యాయ నిపుణులు సూచించిన మేరకు గవర్నర్ మూడు రాజధానుల బిల్లులను ఆమోదించారు.

ఒకే రోజులో ఆనందం…..

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించగానే విపక్షాలు తమ విజయంగా చెప్పుకున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా తన తప్పును తెలుసుకుని వ్యవహరించాలని వ్యాఖ్యానించాయి. నిమ్మగడ్డ నియామకం ఉత్తర్వులు వెలువడిన గంటల్లోనే మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించడంతో రాజ్ భవన్ పై విపక్షాలు దాడిని ప్రారంభించాయి. మొత్తం మీద జగన్ ప్రభుత్వానికి మూడు రాజధానుల ఏర్పాటుపై లైన్ క్లియర్ కావడంతో అధికార పార్టీలో ఆనందం వెల్లువెత్తింది. విపక్షాలు మాత్రం

Tags:    

Similar News