నిమ్మగడ్డ విషయంలో జగన్ కు వేరే ఆప్షన్ లేదా?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా కొనసాగించాలని గవర్నర్ ఆదేశించారు. ఈ మేరకు గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది [more]

Update: 2020-07-22 06:30 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా కొనసాగించాలని గవర్నర్ ఆదేశించారు. ఈ మేరకు గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా కొనసాగకుండా ఉండేా చేసేందుకు వేరే ఆప్షన్ లేవన్నది వాస్తవం. గవర్నర్ ఆదేశాలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను విధిగా పదవిలో నియమించాల్సి ఉంటుంది.

తొలి నుంచి ప్రతిష్టాత్మకంగానే…..

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో జగన్ ప్రభుత్వం తొలి నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయన స్థానంలో కనగరాజ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంశాఖకు రాసిన లేఖ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తయారైందని ఆరోపించింది. దీనిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు కూడా ఆదేశించింది. దీంతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా ఆశ్రయించింది.

సుప్రీంకోర్టుకు మూడుసార్లు….

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనను నిబంధనలకు వ్యతిరేకంగా తొలగించడంపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పంచాయతీ రాజ్ చట్టంలో చేసిన సవరణల ఆధారంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవిని కోల్పోయారని ప్రభుత్వం పిటీషన్ లో పేర్కొంది. తాము ఆయనను పదవి నుంచి తొలగించలేదని పేర్కొంది. హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని కోరింది. మూడు సార్లు సుప్రీంకోర్టు తలుపులను రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ విషయంలో తట్టింది.

జగన్ ప్రభుత్వం ఏం చేస్తుంది?

ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టులో ప్రభుత్వంపై ఉన్న కోర్టు థిక్కార పిటీషన్ పై కూడా స్టే ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవిలో చేరకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల అధికారి నియామకం గవర్నర్ చేయాల్సి రావడంతో ఇక జగన్ ప్రభుత్వానికి వేరే ఆప్షన్ లేదని, ఒకవేళ అనుకూలంగా వ్యవహరించకపోతే రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News