నిమ్మగడ్డ ఉండగా ఎన్నికలు జరగవ్.. ఇది పక్కా ?

జగన్ అంటే జగనే. అది ఆరు అయినా తొమ్మిది చేయగలరు, కావాలంటే తన వైపు నుంచి చూడమనగలరు. ఇపుడు ఏపీలో జగన్ యుధ్ధం చేస్తున్న వారిలో టీడీపీనే [more]

Update: 2020-06-18 13:30 GMT

జగన్ అంటే జగనే. అది ఆరు అయినా తొమ్మిది చేయగలరు, కావాలంటే తన వైపు నుంచి చూడమనగలరు. ఇపుడు ఏపీలో జగన్ యుధ్ధం చేస్తున్న వారిలో టీడీపీనే కాక ముందు వరసలో మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఉన్నారు. ఆయన ఏకంగా జగన్ నే సవాల్ చేశారు. స్థానిక ఎన్నికలను చెప్పాపెట్టకుండా వాయిదా వేయడమే కాదు, ఆ తరువాత జగన్ సర్కార్ ని ఏకంగా ఫ్రాక్షనిస్ట్ గా చిత్రీకరించి కేంద్రానికి లేఖ రాశారు. నిజంగా జగన్ కి కేంద్రంతో మంచి రిలేషన్స్ ఉండబట్టి సరిపోయింది కానీ అదే వేరే విధంగా అక్కడి రాజకీయం ఉంటే జగన్ కి ఊహించని ఉపద్రవమే వచ్చేపడేది. అది కావాలనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేశారని జగన్ అనుమానిస్తున్నారు కూడా. అది ఇపుడు తలచుకునే జగన్ ఆయన్ని అసలు క్షమించలేకపోతున్నారుట.

నమ్ముతున్నారా….?

ఇక జగన్ ఆయనే మరోసారి ఎస్ఈసీ గా ఏపీకి వస్తారని గట్టిగా నమ్ముతున్నట్లుగానే ఉంది. ఎటూ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేదు, అంతేకాదు, రాజ్యాంగ సంస్థలతో ఆటలొద్దు అంటూ గట్టిగా హెచ్చరికతో కూడిన వ్యాఖ్యలు చేసింది. ఇది చాలు నిమ్మగడ్డ వచ్చి మళ్ళీ అదే సీట్లో కూర్చుంటాడని చెప్పడానికి. అందుకే జగన్ ఇపుడు లోకల్ బాడీ ఎన్నికల విషయంలో అసలు తొందరపడడంలేదులా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూర్చుంటే కూర్చోనీ. ఆయన కేవలం ఉత్సవ విగ్రహంగా ఆ సీట్లో ఉంటారు. అదీ కూడా ఏడెనిమిది నెలలు మాత్రమేనని జగన్ భావిస్తున్నారని అంటున్నారు.

లైట్ తీసుకున్నారా?

ఇదిలా ఉండగా ఈ మధ్య జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొందరు మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ముఖ్యమంత్రితో ప్రస్తావిస్తే ఆయన నవ్వి ఊరుకున్నారుట. ఇపుడెందుకు ఆ సంగతి, కోర్టులో కేసు ఉందికదా చూద్దామంటూ దాటవేసే ప్రయత్నం చేశారని భోగట్టా. అంటే సీఎం మదిలో వేరే ఆలోచనలు ఉన్నాయని పార్టీ నేతలు అంటున్నారు. ఎటూ ఇపుడు కరోనా వైరస్ ఏపీలో ఉంది. అది మరికొన్ని నెలల పాటు ఉంటుంది. కేసులు తగ్గుముఖం పట్టడానికి కనీసం ఆరేడు నెలలు పడుతుంది అంటున్నారు. అప్పటివరకూ ఎన్నికల ఊసే వద్దు అని జగన్ అనుకుంటున్నారుట.

కొత్త షెడ్యూలుతోనే…?

జగన్ లోకల్ బాడీ ఎన్నికల విషయంలో కొత్త షెడ్యూల్ నే కోరుకుంటున్నారని అంటున్నారు. అంటే ఇప్పటివరకూ అయిన అయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఏకగ్రీవాలు, మెజారిటీలు కూడా ఆయన మరచిపోవాలనుకుంటున్నారుట. అది కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పూర్తి కాగానే కొత్తగా వచ్చే ఎన్నికల అధికారి చేతుల మీద నోటిఫికేషన్ జారీ చేయించి అప్పుడు ఎన్నికలకు వెళ్దామనుకుంటున్నారుట. అంటే 2021 మారి 31తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ అయిపోతారు. ఆ తరువాత తాను ఎంపిక చేసుకున్న ఎస్ ఈసీతో ఎన్నికలకు జగన్ వెళ్తారన్నమాట. ఆ విధంగా చూసుకుంటే 2021 వేసవిలోనే లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయని వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న మాటగా ఉంది.

Tags:    

Similar News