నిమ్మగడ్డ కసి తీర్చుకుంటారా?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు తీర్పుతో తిరిగి ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశమున్నా హైకోర్టు తీర్పుకు [more]

Update: 2020-05-30 00:30 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు తీర్పుతో తిరిగి ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశమున్నా హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా అక్కడ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశముంది. దీంతో ఆయన చేతుల మీదుగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. హైకోర్టు తీర్పుతో జగన్ ఒక రకంగా డిఫెన్స్ లో పడినట్లయింది.

ఆయన చేసిన ఆరోపణలు…..

నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు తీర్పుతో తిరిగి విధుల్లో చేరినప్పటికీ గతంలో మాదిరిగా ఆయన ఉండబోరన్నది సుస్పష్టం. ఆయనను పదవి నుంచి తొలగించిన తర్వాత చేసిన వ్యాఖ్యలు, రాసిన లేఖలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఏకగ్రీవం అవ్వడాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పుపట్టారు. గతంలో జరిగిన ఎన్నికలను పోల్చి చూపారు. అనేక చోట్ల ఏకగ్రీవం కావడానికి కారణాలు కూడా ఆయన తెలిపారు.

హోంశాఖకు రాసిన లేఖలో…..

అంతేకాకుండా తనకు కేంద్ర బలగాలతో సెక్యూరిటీ కావాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. దీంతో పాటు ఫ్యాక్షనిజం మీద, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన తాను కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొనడం విశేషం. దీన్ని బట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందంటున్నారు. తిరిగి ఎన్నికలను నిర్వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంశాఖకు రాసిన లేఖ వివాదమయిన సంగతి తెలిసిందే.

రాజకీయ పార్టీ నేతలతో…..

ఈ లేఖ టీడీపీ కార్యాలయంలో తయారయందన్న వ్యాఖ్యలు కూడా విన్పించాయి. సీఐడీ కూడా ఈ కేసును విచారణ చేస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓఎస్డీని కూడా విచారించారు. ఈ పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యలు చేపడితే వైసీపీ సర్కార్ కు చుక్కలు చూపించడం ఖాయమంటున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తిరిగి నామినేషన్ల నుంచి ప్రారంభమయ్యే అవాకాశముందంటున్నారు. అందుకే వివిధ రాజకీయపార్టీలతో తాను త్వరలోనే సమావేశమవుతానని ఆయన చెప్పారు. వారి అభిప్రాయాల మేరకు ఎన్నికలను రీషెడ్యూల్ చేసే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News