ఎలక్షన్ క్యాలండర్ రెడీ అట… ఆ తర్వాత కూడా?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మరో నెలన్నర మాత్రమే ఉంది. మార్చి 31వ తేదీన ఆయన పదవీ కాలం పూర్తికానుంది. ఇప్పటికే [more]

Update: 2021-02-19 14:30 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మరో నెలన్నర మాత్రమే ఉంది. మార్చి 31వ తేదీన ఆయన పదవీ కాలం పూర్తికానుంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేశారు. ఈనెల 21న పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి. వెనువెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిపేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమయ్యారు. ఆ తర్వాత వరసగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరపాలన్నది ఆయన ఆలోచనగా ఉంది.

వెంటవెంటనే షెడ్యూల్…

వెంటవెంటనే ఎన్నికల షెడ్యూళ్లను విడుదల చేసేలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రణాళిక రూపొందిచుకున్నట్లు తెలుస్తోంది. అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను మార్చి 31వ తేదీలోపు పూర్తి చేయడంపై సాధ్యాసాధ్యాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే తనకు నమ్మకమైన అధికారులతో ఆయన సమావేశమై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. కొన్ని కార్పొరేషన్ ఎన్నికలు జరిపేందుకు న్యాయస్థానంలో కేసులు ఉన్నాయి.

న్యాయపరమైన చిక్కులు….

ముఖ్యంగా విశాఖ వంటి కార్పొరేషన్ ఎన్నికలు జరపాలంటే న్యాయస్థానాల నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. న్యాయస్థానాల నుంచి క్లియరెన్స్ తెచ్చే బాధ్యతను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొందరు అధికారులకు అప్పగించారని సమాచారం. మార్చి 31వ తేదీకి అన్ని ఎన్నికలు పూర్తికాకపోయినా అనుకున్న విధంగానే షెడ్యూల్ విడుదల చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించారు.

మరో మూడు నెలలు…..

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో ప్రయత్నం కూడా చేయనున్నారు. తన పదవీకాలం మూడు నెలలు ప్రభుత్వం కావాలని తొలగించిందని, దానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలుంది. గతంలో నిమ్మగడ్డను తొలగించి కనగరాజ్ ను నియమించడంతో న్యాయస్థానం తీర్పు వచ్చేంత వరకూ మూడు నెలలు ఆగాల్సి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయం కారణంగానే తాను మూడు నెలల పదవీ కాలాన్ని కోల్పోవాల్సి వచ్చిందంటున్నారు. న్యాయస్థానంలో నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వస్తే మరో మూడు నెలలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా కొనసాగే వీలుంది. మొత్తం మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ మూడు నెలల ఎన్నికల క్యాలెండర్ ను రూపొందించుకున్నారని సమాచారం.

Tags:    

Similar News