నిమ్మగడ్డ మనసులో అదే ఉందట…అదే జరిగితే?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంతో తలపడేందుకే సిద్ధమయినట్లు కన్పిస్తుంది. ఆయన చేస్తున్న కామెంట్స్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేస్తున్నవే. ఏకగ్రీవ ఎన్నికల విషయంలో తనకు [more]

Update: 2021-02-06 13:30 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంతో తలపడేందుకే సిద్ధమయినట్లు కన్పిస్తుంది. ఆయన చేస్తున్న కామెంట్స్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేస్తున్నవే. ఏకగ్రీవ ఎన్నికల విషయంలో తనకు స్పష్టమైన అభిప్రాయం ఉందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఏకగ్రీవాలకు తావు ఉందా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఏకగ్రీవాలపై తనకు అనుమానాలున్నాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన మనసులో మాటను బటయపెట్టారు.

ఆ ఏకగ్రీవాలన్నింటినీ……

గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాల్లో అవకతవకలు జరిగాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ బహిరంగంగానే తెలిపారు. అంటే ఆ ఎన్నికలకు సంబంధించి ఫ్రెష్ నోటిషికేషన్ మరోసారి విడుదల చేసే అవకాశముందని అర్థమవుతుంది. తాను ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఏకగ్రీవాలపై ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా ఆయన చెబుతున్నారు.

పదవీకాలం పూర్తయ్యేలోగా….

దీంతో పాటు మార్చి 31వ తేదీతో తన పదవీ కాలం పూర్తవుతుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదేపదే గుర్తు చేసుకుంటున్నారు. ఈలోపే మిగిలిన ఎన్నికలను కూడా పూర్తి చేసి వెళ్లాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. అయితే గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన వారు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంది. గత ఏడాది మార్చి 8వ తేదీన కరోనా కారణంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. మధ్యలో ఆగిపోయిన వాటిని నిర్వహించకుండా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడంలోనే అనుమానాలు కలుగుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు.

లీగల్ ప్రాబ్లెంతో…..

మధ్యలో ఆగిపోయిన వాటికి ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశముందని భావించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారంటున్నారు. వైసీపీ కూడా తొలుత ఎన్నికలను వ్యతిరేకించినా న్యాయస్థానాల జోక్యంతో అన్ని ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లే కన్పిస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది.

Tags:    

Similar News