పవర్ తగ్గిస్తారా? డమ్మీనీ చేస్తున్నారుగా?

వైసీపీ సర్కార్ కి హఠాత్తుగా ఎస్ఈసీ నుంచి గట్టి చెక్ వచ్చిపడింది. దూకుడుగా పోదామనుకుంటున్న జగన్ వైఖరికి ఇది దారుణమైన బ్రేక్ గా చూడాలి. దాంతో అధికార [more]

Update: 2020-03-21 06:30 GMT

వైసీపీ సర్కార్ కి హఠాత్తుగా ఎస్ఈసీ నుంచి గట్టి చెక్ వచ్చిపడింది. దూకుడుగా పోదామనుకుంటున్న జగన్ వైఖరికి ఇది దారుణమైన బ్రేక్ గా చూడాలి. దాంతో అధికార పార్టీ కిందా మీదా అవుతోంది. కనీసం తాము అనుకున్నట్లుగా స్థానిక ఎన్నికలను కూడా నిర్వహించు కోలేకపోతున్నామన్న బాధ వైసీపీ పెద్దల్లో కనిపిస్తోంది. ఓ విధంగా ఇది అవమానంగా ఉంది. మరో విధంగా కనీసం అడుగు ముందుకు వేయాలంటే ఎస్ఈసీ అనుమతి తీసుకోవాల్సిరావడం కూడా ఇబ్బందిగా ఉంది. ఇక స్థానిక ఎన్నికలు ఎపుడు జరుగుతాయో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కే ఎరుక అన్న వాతావరణం ఉంది.

విపక్షమే పై చేయి…

ఒక్కసారిగా వారు వీరు అయ్యారు. అధికారంలో ఉన్న జగన్ స్థానిక ఎన్నికలు డిమాండ్ చేసే పరిస్థితి ఉంటే విపక్షంలో ఉన్న బాబు ఇపుడు వద్దు అని ఆపించగలిగారు. మరి ఎన్నికలు బాబు కోరుకుంటేనే జరిగే సీన్ కూడా ఉందని రాజకీయం బాగా తెలిసిన వారికి అర్ధమైపోతున్న సంగతి. మరో వైపు చూసుకుంటే నిమ్మగడ్డ ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని ఆయన రాసిన లేఖ చెప్పేస్తోంది. ఆయన హైదరాబాద్ నుంచి తన విధులను నిర్వహించాలనుకోవడం ద్వారా తాను వైసీపీకి మరిన్ని బ్రేకులు వేస్తానని కూడా చెప్పకనే చెప్పేశారు. దాంతో స్థానిక ఎన్నికలపైన జగన్ సర్కార్ కి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఉంది.

పవర్ తగ్గిస్తారా…..?

అప్పట్లో పీవీ నరసింహారావు దేశ ప్రధాని గా ఉన్నపుడు రాష్ట్రాలకు కూడా ఈసీలు ఉండాలని చట్టాన్ని తీసుకువచ్చారు. దాని వల్ల గత మూడు దశాబ్దాలుగా దేశంలో ఈసీలు ప్రతీ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. అయితే అదే పీవీ నాడు సిఈసీ గా ఒకే ఒక్కడుగా ఉన్న శేషన్ ధాటిని తట్టుకోలేక ముగ్గురు సభ్యులతో సీఈసీ ఉండేలా చట్ట సవరణలు చేశారు. ఆ విధంగా ఒకరు ముగ్గురుగా కేంద్ర స్థాయిలో అయ్యారు. రాష్ట్రాల్లో మాత్రం ఏకైక ఎన్నికల అధికారి ఉంటున్నారు. దాని వల్ల ఇబ్బందులు ఎవరూ పడకపోయినా ఇపుడు జగన్ మాత్రం దాని చేదు అనుభవాలను చవి చూస్తున్నారు. ఒకరే ఉంటే ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హఠాత్తుగా నిలిపివేసిన స్థానిక ఎన్నికలే పెద్ద ఉదాహరణగా కళ్ళ ముందు ఉంది దాంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పవర్ తగ్గించాలనుకుంటున్నారుట.

ముగ్గురవుతారా..?

ఇక ఏపీలో ఇకపై నిమ్మగడ్డతో పాటు మరో ఇద్దరిని ఎన్నికల అధికారులుగా నియమించాలని జగన్ సర్కార్ కొత్త ఆలోచనలు చేస్తోంది. అపుడు ముగ్గురులో కనీసం ఇద్దరైనా కలిస్తే కానీ మెజారిటీ నిర్ణయం రాదని , అది కొంత మేలు అని జగన్ సర్కార్ భావిస్తోందిట. అదే విధంగా ఆ ఇద్దరూ తమ వారిని వేసుకోవడం ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను డమ్మీని చేయాలని కూడా వ్యూహరచన చేస్తోంది. సాధ్యమైనంత తొందరలోనే జగన్ సర్కార్ నిమ్మగడ్డకు చెక్ పెట్టే దిశగా ఈ చట్టానికి పదును పెడుతుందని అంటున్నారు. మరి అసెంబ్లీలో దీనికి ఓకే కానీ, శాసనమండలిలో టీడీపీ మద్దతు ఇస్తుందా, అంటే చూడాల్సిందే.

Tags:    

Similar News