నిమ్మగడ్డ ఇక ఊరుకోరు.. జగన్ సిద్ధంగా ఉంటేనే బెటర్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన హయాంలోనే అన్ని ఎన్నికలు ముగించివేస్తారు. ఇందుకు జగన్ కూడా మానసికంగా సిద్ధమయి ఉంటేనే మంచిది. తాజాగా పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన [more]

Update: 2021-01-25 13:30 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన హయాంలోనే అన్ని ఎన్నికలు ముగించివేస్తారు. ఇందుకు జగన్ కూడా మానసికంగా సిద్ధమయి ఉంటేనే మంచిది. తాజాగా పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిమ్మగడ్డ రమే‌ష్ కుమార్ లో మరింత ఉత్సాహాన్ని పెంచిందనే చెప్పాలి. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మిగిలిన జడ్పీటీసీ, ఎంపీీటీసీ ఎన్నికల ప్రక్రియను కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తి చేస్తారన్నది వాస్తవం.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా…

మార్చి 8వ తేదీన నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మధ్యలోనే వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే దీనిని ప్రారంభించే అవకాశముంది. అయితే ఈ ఎన్నికలపై హైకోర్టులో కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇంప్లీడ్ అయి ా కేసులను పరిష్కరించుకుని ఆ ఎన్నికలను కూడా పూర్తి చేసే అవకాశముంది.

అన్ని ఎన్నికలను….

దీంతో పాటు మున్సిపల్ ఎన్నికలను కూడా తన హయాంలోనే పూర్తి చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నట్లు కనపడుతుంది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇన్ ఛార్జి అధికారుల పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. అయినా తాను ఎన్నికలను జరిపితీరాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తులు కూడా ఆయన చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యాయపరమైన చిక్కులను తొలగించేందుకు న్యాయనిపుణులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంప్రదిస్తున్నట్లు సమాచారం.

న్యాయస్థానాన్ని ఆశ్రయించినా….

మార్చి చివరి నాటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగుస్తుంది. ఈలోగానే అన్ని ఎన్నికలను కంప్లీట్ చేసి వెళ్లలాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. ఇందుకు జగన్ ప్రభుత్వం కూడా మానసికంగా సిద్ధమయి ఉండటమే మంచిది. న్యాయస్థానాలు కూడా ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని ఫైనల్ గా తీసుకుంటాయి తప్పించి, ప్రజాభిప్రాయానికి విలువ ఉండదన్న విషయాన్ని జగన్ ఇప్పటికైనా గుర్తుంచుకుంటేనే మంచిది. ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నా, రాజ్యాంగ పదవిలో ఉన్న వారిపై నిందలు మోపడాన్ని న్యాయస్థానాలు అస్సలు సహించవు. ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం గుర్తుంచుకుని మెలగాలి. అన్ని ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలో పూర్తి చేసేందుకు సిద్ధపడాలి.

Tags:    

Similar News