నిమ్మగడ్డా…. నీ నీతులు బయట వారికేనా….?

రాజ్యంగం గురించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. ఆయన గత తొమ్మిది నెలల నుంచి అనుసరిస్తున్న వైఖరిని చూస్తే ఎవరికైనా ఆయన నీతులు గురించి మాట్లాడితే [more]

Update: 2021-01-23 09:30 GMT

రాజ్యంగం గురించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. ఆయన గత తొమ్మిది నెలల నుంచి అనుసరిస్తున్న వైఖరిని చూస్తే ఎవరికైనా ఆయన నీతులు గురించి మాట్లాడితే నవ్వురాక మానదు. చీఫ్ సెక్రటరీ తనకు రాసిన లేఖ తనకంటే ముందుగానే పత్రికలకు లీక్ అయిందని, రాజ్యాంగ విలువలను కాపాడాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. నిజంగా గురవింద సామెత నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సరిగ్గా సరిపోతుంది.

గతంలో మనం రాసిన లేఖలు….

గతంలో కేంద్ర హోం శాఖకు రాసిన లేఖలు, రాష్ట్ర ప్రభుత్వానికి రాసిని లేఖలు అందరికంటే ముందుగానే కొన్ని పత్రికలకు ఎలా చేరాయో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మర్చిపోయి ఉంటారేమో. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టులో దాఖలు చేసిన అఫడవిట్ , పిటీషన్ లు సయితం ముందుగానే కొన్ని పత్రికల్లో ప్రచురితం కావడం ఎలాంటి విలువలో ఆయన ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం రాజ్యాంగ ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య విలువల గురించి నిమ్మగడ్డ మాట్లాడుతుండటం విచిత్రమే.

ప్రయివేటు హోటల్ లో…..

ఇక హైదరాబాద్ లో ఒక ప్రయివేటు హోటల్ లో కొన్ని రాజకీయ పార్టీల కీలక నేతలతో సమావేశం ఒక రాజ్యాంగ వ్యవస్థ అధిపతిగా ఎందుకు చేశారో చెప్పాల్సిన బాధ్యత నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైనే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఎన్నికల కమిషనర్ సమాలోచనలు జరపడం ఏ విలువలకు అద్దం పడుతున్నాయో చెబితే బాగుండేది. కానీ అవతల వారికే విలువలు, ప్రజాస్వామ్య హక్కులు ఉంటాయి. మన దగ్గరకు వచ్చేసరికి హక్కులు.. విలువలు జాన్తానై. దేశాన్ని, రాష్ట్రాన్ని ఉద్దరించే వ్యక్తిగా బిల్డప్ తప్ప మన వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలి.

గ్లాస్ షీల్డ్ మాటున….

నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా లేదంటూ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. మరి కరోనా లేకుంటే ఆయన నోటిఫికేషన్ కు గ్లాస్ షీల్డ్ మధ్యలో మీడియా సమావేశం ఎందుకు పెట్టారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనకున్న ప్రాణం విలువ ప్రజలదీ, ఉద్యోగులదీ కాదా? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కరోనాతో అంత భయపడుతూ షీల్డ్ మాటున దాక్కుని మీడియా సమావేశం పెట్టే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎన్నికలను నిర్వహించే హక్కులేదంటున్నాయి ఉద్యోగ సంఘాలు.

Tags:    

Similar News