నిమ్మగడ్డకు ఇన్ని గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయ్…?

చరిత్రలో పేజీలు ఎపుడు ఖాళీగానే ఉంటాయి. పరిస్థితులు, బలమైన సంఘటలను వాటిని ఎప్పటికపుడు భర్తీ చేస్తూ ఉంటాయి. అలా మంచికో చెడ్డకో తనకంటూ ఒక పేజీని మాత్రం [more]

Update: 2021-01-23 03:30 GMT

చరిత్రలో పేజీలు ఎపుడు ఖాళీగానే ఉంటాయి. పరిస్థితులు, బలమైన సంఘటలను వాటిని ఎప్పటికపుడు భర్తీ చేస్తూ ఉంటాయి. అలా మంచికో చెడ్డకో తనకంటూ ఒక పేజీని మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేటాయించుకున్నారని అంటున్నారు. ఫ్యూచర్ లో ఆయన రిఫరెన్స్ కూడా ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇక ఏపీలో చూస్తే గత ఏడాదిగా టీవీ సీరియల్ జీడిపాకం మాదిరిగా ఒక ఎపిసోడ్ సాగింది. అదే ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం మధ్యన సంఘర్షణ. ఎవరికి వారే తగ్గకుండా కధ చాలా దూరం తీసుకువచ్చారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు రాజకీయాలు చేస్తారు, దూకుడుగా ఉంటారు. వారి జోలికి ఎంతటి వారు అయినా వెళ్ళరంటే వెళ్ళరు. ఎందుకొచ్చిన తంటా అనుకుంటారు.

లా ఒక్కింత తెలిసి….

ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏంటి అన్నది గత మార్చిలో స్థానిక ఎన్నికలను ఒక్కసారిగా వాయిదా వేయడం బట్టి లోకానికి తెలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు అంటూ భారీ ప్రకటన ఇచ్చి మరీ మరోసారి సంచలనం సృష్టించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ప్రకటన చేసినపుడు ఇది అయ్యేపనేనా అన్నవారు ఉన్నారు. ప్రభుత్వం దీన్ని న్యాయ సమీక్ష ముందు పెట్టి నెలలు గడిపేస్తుందని కూడా అనుకున్నారు. కానీ నిమ్మగడ్డ అనుకున్నట్లుగా పంచాయతీ ఎన్నికలను జరిపించేస్తున్నారు. దీని వెనక నిమ్మగడ్డ న్యాయ తెలివితేటలు కూడా ఉన్నాయని అంటున్నారు. అవును మరి ఆయన న్యాయ విధ్యను అభ్యసించారు. అది ఆయనకు ఈ కీలకమైన వేళ ఎంతో ఉపయోగపడిందట.

మాతో పెట్టుకోకు…?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరు చూస్తే మూడు దశాబ్దాల క్రితం దేశాన్ని గడగడలాడించిన మాజీ సీఈసీ టీఎన్ శేషన్ గుర్తుకు వస్తున్నారని అన్న వారూ ఉన్నారు. 151 సీట్లతో బంపర్ విక్టరీ కొట్టిన జగన్ ముందు చంద్రబాబు లాంటి వారి రాజకీయాలే పారని రోజులలో ఏడాది కూడా పాలన పూర్తి కాకుండానే ఖంగు తినిపించిన చరిత్ర నిమ్మగడ్డ రమేష్ కుమార్ దే అంటున్నారు. వెనక ఎవరైనా ఉండవచ్చు కాక, కానీ అడుగులు ముందుకు వేసి బలమైన జగన్ ని ఎదుర్కోవడం అంటే మాటలు కాదు, ఇక రాజ్యాంగంలో అన్ని హక్కులూ ఉంటాయి. వాటిని అమలు చేయాలనుకోవడం అంటే గట్స్ ఉండాలి, జగ మొండి అయిన జగన్ తో ఢీ కొట్టి నిమ్మగడ్డ రాజ్యాంగ వ్యవస్థ పవర్ అంటే ఇదీ అని నిరూపించి మరో శేషన్ అనిపించుకున్నారు అంటున్నారు. ఎన్నికల సంఘంతో పెట్టుకోకు అన్నట్లుగా గట్టి సందేశమే ఇచ్చారని అంటున్నారు.

హీరో వర్షిప్…..

ఒకపుడు దేశంలో శేషన్ కి హీరో వర్షిప్ ఉండేది. తరువాత కాలంలో ఏపీ రాజకీయాల్లో సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణకు కూడా భారీ కటౌట్లతో సినీ హీరో ఇమేజ్ ని బిల్డప్ చేసి పెట్టారు. ఇపుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద కూడా ఒక వర్గం వారు అదే హీరో వర్షిప్ చూపిస్తున్నారు అంటున్నారు. నిమ్మగడ్డ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా కొత్తల్లో పనిచేశారు. ఆ తరువాత ఆయన అడ్మినిస్ట్రేటివ్ వింగ్ లోనే పూర్తి కాలం పని చేశారు. ఇక ఆయన నాలుగేళ్ళ పాటు ఎన్నికల సంఘం అధికారిగా ఉన్న రాని పేరు ఒక్క ఏడాదిలోనే సంపాదించారు. మొత్తానికి జగన్ మీద పై చేయి సాధించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రిటైర్ అయినా కూడా ఒక వెలుగు వెలిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News