నిమ్మగడ్డకు ఎందుకంత తొందర? ఏం చేయాలని?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తొందర ఎక్కువలా ఉంది. ఆయన మరో పదినెలలో ఎన్నికల కమిషనర్ పదవి నుంచి వైదొలగబోతున్నారు. చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ [more]

Update: 2020-05-31 03:30 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తొందర ఎక్కువలా ఉంది. ఆయన మరో పదినెలలో ఎన్నికల కమిషనర్ పదవి నుంచి వైదొలగబోతున్నారు. చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమితులయ్యారు. 2016లో ఆయనను సీఈసీగా చంద్రబాబు నియమించారు. 2021 నాటికి ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. మరో పది నెలలు మాత్రమే పవర్ లో ఉండే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా పంతాలకు పోతున్నట్లుంది.

తీర్పు వెలువడిన…

హైకోర్టులో తీర్పు వెలువడిన గంట సమయంలోనే తాను పదవీ బాధ్యతలను స్వీకరించినట్లు ఆయన ప్రకటించడం విడ్డూరంగా ఉంది. హైకోర్టు కాపీ చేతికి అందకుండానే ఆయన తాను ఎస్ఈసీగా బాధ్యతలను చేపట్టినట్లు ప్రకటించుకోవడం ఆయన తొందరపాటుతనానికి నిదర్శనమనే చెప్పాలి. ఎందుకంత తొందర? ఆయనకు ఎందుకంత పట్టుదల? అన్నది సామాన్య ప్రజల్లోనే కాదు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

పొరుగు రాష్ట్రంలో ఉండి….

నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత రెండున్నర నెలల నుంచి ఏపీలో లేరు. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేక, తనకు భద్రత లేదని భావించి ఆయన పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు వెళ్లిపోయారు. కేంద్ర ప్రభుత్వ బలగాలతో తనకు భద్రత కల్గించాలంటూ కేంద్ర హోంశాఖను లేఖ ద్వారా కోరారు. వెంటనే భద్రతను కూడా కల్పించారు. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంలేదనే అనుకోవాలి.

సేమ్ స్టేట్ గవర్న్ మెంట్ కు కూడా అంతే?

అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై నమ్మకం లేదు. ఎందుకంటే ఆయనపై ఇప్పటికే ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంశాఖకు రాసిన లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందని సీబీఐ ఇప్పటికే ప్రాధమికంగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రీఎంట్రీని అంగీకరించని పరిస్థితి. అందుకే సుప్రీంకోర్టుకు వెళతామని, ఆయనను ఎస్ఈసీగా గుర్తించడం లేదని స్వయంగా అడ్వొకేట్ జనరల్ చెప్పడం విశేషం. సుప్రీంకోర్టుకు వెళుతున్న దృష్ట్యా ఆయన స్వీయ ఉత్తర్వులు చెల్లవని పేర్కొన్నారు. మొత్తం మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తొందర ఎక్కువగానే ఉంది. మొత్తం మీద నిమ్మగడ్డ వ్యవహారం ఇప్పట్లో సమసిపోయేలా లేదు.

Tags:    

Similar News