నిమ్మగడ్డ వార్ మళ్లీ మొదలయిందే?

మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కు రాసిన లేఖ రాష్ట్రంలో మరోసారి వివాదమయింది. తనకు భద్రత కల్పించాలని, వైసీపీ నేతల [more]

Update: 2020-04-16 00:30 GMT

మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కు రాసిన లేఖ రాష్ట్రంలో మరోసారి వివాదమయింది. తనకు భద్రత కల్పించాలని, వైసీపీ నేతల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రహోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ విషయం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ధృవీకరించారు. అందుకే ఆయనకు భద్రత కల్పించారు కూడా.

డీజీపీకి లేఖ రాయడంతో…..

కానీ ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీకి లేఖ రాశారు. నిమ్మగడ్డ ఆ లేఖ రాయలేదని, ఆయన సమ్మతితోనే అది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తయారైందన్నది విజయసాయిరెడ్డి ఆరోపణ. ఈ లేఖ తయారీలో రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, టీడీపీ నేతలు వర్ల రామయ్య, తొండెపు దశరథ జనార్థన్ ల ప్రమేయం ఉందని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖ రాయడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు.

టీడీపీ ఆఫీసులో తయరైందని….

కేంద్ర హోంశాఖకు పంపిన లేఖలో సంతకం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ది కాదని, అది ఫోర్జరీ అని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి విచారించి నిజాన్ని తేల్చాలని ఆయన కోరారు. టీడీపీ ఆఫీసులో తయారైన లేఖ అని తాను గట్టిగా నమ్ముతున్నానని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. నిజానిికి ఈ లేఖను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. లేఖలో ప్రభుత్వంపైనా, పార్టీపైనా విమర్శలు ఉండటమే ఇందుకు కారణం. విచారణ జరపాలని భావించే విజయసాయిరెడ్డి ద్వారా లేఖ ను పార్టీ డీజీపీకి ఇప్పించిందన్నది పార్టీ వర్గాల టాక్.

ఖండించిన టీడీపీ….

కానీ టీడీపీ నేతలు దీనిని ఖండిస్తున్నారు. రమేష్ కుమార్ లేఖను తాము ఎందుకు తయారు చేస్తామని ప్రశ్నిస్తున్నారు. రమేష్ కుమార్ ఆ లేఖను తాను రాయలేదని ఖండించారా? అని నిలదీస్తున్నారు. విజయసాయిరెడ్డి కేవలం జరుగుతున్న పరిణామాలను పక్కదోవ పట్టించేందుకే ఎప్పడో నిమ్మగడ్డ రాసిన లేఖను ఇప్పుడు బయటకు తీసుకు వచ్చారని కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. తనపై ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని కూడా ఆయన హెచ్చరించారు. మొత్తం మీద నిమ్మగడ్డ లేఖ మరోసారి ఏపీ రాజకీయాల్లో కలకంల రేపుతోంది.

Tags:    

Similar News