నిమ్మగడ్డా నీకిక అర్హత లేదు

నిమ్మగడ్డ రమేష్ కుమార్.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఆయనను ప్రభుత్వం అనవసరంగా తొలగించారేమోనన్న ఒక సానుభూతి నిన్నటి వరకూ ఆయనపై ఉండేది. కానీ నేడు నిమ్మగడ్డ [more]

Update: 2020-06-23 08:00 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఆయనను ప్రభుత్వం అనవసరంగా తొలగించారేమోనన్న ఒక సానుభూతి నిన్నటి వరకూ ఆయనపై ఉండేది. కానీ నేడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పనికి రారని తేలిపోయింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా రాజకీయ నేతలతో జరిపిన భేటీ ప్రకంపనలు రేపుతోంది. సోషల్ మీడియాలో నిమ్మగడ్డ వ్యవహారం వైరల్ గా మారింది.

మొన్నటి వరకూ అనుమానాలే….

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం సానుభూతిపరుడు. ఆయన చంద్రబాబు చెప్పినట్లే నడుచుకుంటాడు. మాకు ఆయనపై నమ్మకం లేదు. అంటూ నిన్న మొన్నటి వరకూ వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే ఇది వ్యక్తిగత కక్షేమో అనుకున్నాం. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తే తప్పేంటి అని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ర విషయంలో అన్పించింది. ప్రభుత్వమే తొందరపడిందన్న భావన కూడా కలిగింది.

కొంత బాధ అనిపించినా…

ిఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించి కనగరాజ్ ను నియమిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా కొంత పెయిన్ అనిపించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంశాఖకు రాసిన లేఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి తయారయిందని వైసీపీ చెబుతున్నా ఎక్కడో అనుమానం కలిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అలా చేస్తారా? అన్న అనుమానం కల్గింది. కానా ఈ అనుమానాలన్నింటిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పటాపంచలు చేశారు.

నిమ్మగడ్డ పావుగా మారరాని….

ఆయన వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారని దాదాపుగా నిర్ధారణ అయింది. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లోని మూడో అంతస్తులోని ఒక గదిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ల భేటీ సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో ఆయన ఇక ఎన్నికల కమిషనర్ గా పనిచేయడానికి అనర్హుడనే అనిపించక మానదు. ఈ నెల 13న పార్క్ హయత్ హోటల్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ భేటీ దాదాపు మూడు గంటల జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ రాజకీయాల్లో పావుగా మారారన్నది వాస్తవం.

Tags:    

Similar News