వైసీపీలోకి నెక్ట్స్ ఆయనేనా..?

క్రమశిక్షణకు మారుపేరుగా ఆ పార్టీని చెప్పుకుంటారు. ఆ పార్టీలోని నేతలంతా అధినేత గీసిన గీతను దాటరు. ఎంతపెద్ద నేతలైనా అధినేత ఏది చెబితే అదే రైట్ అంటారు. [more]

Update: 2019-02-19 01:30 GMT

క్రమశిక్షణకు మారుపేరుగా ఆ పార్టీని చెప్పుకుంటారు. ఆ పార్టీలోని నేతలంతా అధినేత గీసిన గీతను దాటరు. ఎంతపెద్ద నేతలైనా అధినేత ఏది చెబితే అదే రైట్ అంటారు. అయితే, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాత్రం చంద్రబాబు నాయుడు గీసిన అన్ని గీతలూ దాటేశారు. ఒక్కసారి కాదు పదేపదే ఆయన అధినేతను, పార్టీని ధిక్కరిస్తున్నారు. ఇది ఎంతవరకు చేరిదంటే.. ఆయన జగన్ కు ఓటేయాలని పరోక్షంగా బహిరంగ సభలోనే ప్రకటించే వరకు. పార్టీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న ఆయన నేడో రేపో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమే ఊహాగానాలు వస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే రూట్ కూడా క్లీయర్ అయిందంటున్నారు.

జగన్ కు ఓటేయాలని పరోక్షంగా చెప్పినా…

2009లో నరసరావుపేట ఎంపీగా పనిచేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయించారు. ఆయన అక్కడ గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, పార్టీ పట్ల ఆయన రెండుమూడేళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన భావిస్తున్నారు. తనకు టీడీపీలో గౌరవం లేదని ఆయన బాధపడుతున్నారు. దీనికి తోడు ఆయన మళ్లీ తన పాట నియోజకవర్గమైన నరసరావుపేట నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, అక్కడ ఇప్పటికే రాయపాటి సాంబశివరావు ఉన్నారు. దీంతో మోదుగుల డిమాండ్ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల ఓ సామాజకవర్గం ఏర్పాటు చేసుకున్న సమావేశానికి వెళ్లిన మోదుగుల పరోక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పారు. ఇదివరకులా అయితే మోదుగులపై చంద్రబాబు కచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి.. కానీ ఆయన తీసుకోవడం లేదు.

లైన్ క్లియర్ అయ్యింది..!

ఇక, రాజకీయం జీవితంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నల్లచొక్కాతో అసెంబ్లీకి వెళ్లారు. నేతలను అంతా నల్ల చొక్కాలతో రావాలన్నారు. కానీ, మోదుగుల మాత్రం బాహాటంగానే తిరస్కరించి సాధారణ చొక్కాతోనే అసెంబ్లీకి హాజరయ్యారు. మోదుగుల చర్యలన్నీ గమనిస్తే ఆయన పార్టీ మారడం ఖాయమని చాలా రోజులుగా అనుకుంటున్నా ఆయన సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయం ఇప్పుడు వచ్చేసిందంట. రోజుకొకరు చొప్పున టీడీపీ నేతలను చేర్చుకుంటూ వరుస షాక్ లు ఇస్తున్న వైసీపీ.. మోదుగులను చేర్చుకునేందుకు లైన్ క్లీయర్ చేసింది. మోదుగుల బావ అయోధ్యరామిరెడ్డి వైసీపీలో కీలకంగా వ్యహరించారు. ఆయన జగన్ కు సన్నిహితులుగా పేరుంది. ఆయనే మాట్లాడి మోదుగులను పార్టీలోకి తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి, ఆయన కోరుకుంటున్నట్లుగా నరసరావుపేట టిక్కెట్ ఇస్తారో లేదో కానీ మోదగుల చేరిక మాత్రం ఖాయమైందని తెలుస్తోంది. రెండుమూడు రోజుల్లోనే ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉంది.

Tags:    

Similar News