కిమ్ పోయాడటగా.. ఇదే నిజమంటున్నారు

నియంత కిమ్ జోంగ్ ఉన్ మరణించినట్లు మళ్లీ వార్తలు వస్తున్నాయి. కిమ్ కోమాలోకి వెళ్లారని కొందరు, మరణించారని మరికొందరు చెబుతున్నారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ ఆరోగ్యంపై [more]

Update: 2020-08-26 18:29 GMT

నియంత కిమ్ జోంగ్ ఉన్ మరణించినట్లు మళ్లీ వార్తలు వస్తున్నాయి. కిమ్ కోమాలోకి వెళ్లారని కొందరు, మరణించారని మరికొందరు చెబుతున్నారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ ఆరోగ్యంపై గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది. ఆయన బాగానే ఉన్నట్లు ఆ మధ్య కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అధికారుల సమావేశంలో కూడా కిమ్ పాల్గొన్నట్లు ఆ వీడియోలు స్పష్టం చేస్తున్నాయి. అయితే కిమ్ కోమాలో ఉన్నారన్న మాట వాస్తవం కాదని, మరణించారని సీనియర్ జర్నలిస్ట్ రాయ్ కాలీ చెబుతుండటం విశేషం.

త్వరతో జోంగ్ కు పగ్గాలు…

కిమ్ స్థానంలో ఆయన సోదరి కిమ్ యో జోంగ్ త్వరలోనే పగ్గాలు చేపట్టనున్నట్లు కూడా దక్షిణ కొరియా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కిమ్ ఒక నియంత. ఆయన మరణాన్ని బయటకు తెలిపితే దేశంలో తిరుగుబాటు వస్తుందన్న ఏకైక కారణంతో బయటకు తెలియనివ్వడం లేదంటున్నారు. ప్రజలకు కిమ్ మరణంపై తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని పేర్కొంటున్నారు. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణించినప్పుడు కూడా నెలల తర్వాతనే అధికారికంగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు.

ఆరోగ్యంగా ఉండి ఉంటే…..

కిమ్ ఆరోగ్యంగా ఉండి ఉంటే అనేక సందర్భాల్లో బయటకు వచ్చేవారు. అంతేకాదు ఆయన అణ్వాయుధాలను పరిశీలించడం ఒక పిచ్చ. దానిని పరిశీలిస్తూ ఫొటోలు దిగి ప్రపంచానికి తెలిపే వారు. అయితే దాదాపు నెలల నుంచి కూడా కిమ్ జాడ లేకుండా పోయింది. విడుదలయిన ఫొటోలు కూడా పాతవని కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. కిమ్ ఆరోగ్యం బాగాలేదన్నది మాత్రం స్పష్టమవుతుందంటున్నారు.

అధికారిక ప్రకటన అప్పుడే…

ప్రస్తుతం ఉత్తరకొరియాలో పాలన అంతా కిమ్ సోదరి యో జోంగ్ చూస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలను సయితం కిమ్ యో జోంగ్ చూస్తున్నారు. త్వరలోనే ఆమె దేశ అధ్యక్ష్య పదవిని చేపడతారంటున్నారు. కిమ్ జో యోంగ్ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కిమ్ మరణాన్ని అధికారింకగా ప్రకటిస్తారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ 11 వతేదీన కిమ్ చివరిసారిగా పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం మీద ఇప్పటికీ కిమ్ మరణించారా? లేక కోమాలో ఉన్నారా? అన్నది మిస్టరీగానే ఉంది.

Tags:    

Similar News