మోదీ… నీకిది తగునా? వీటిని కూడా?

భారతీయ రైల్వే లో కొత్త శకం మొదలౌతుంది. ఇప్పటికే కొన్ని లైన్లను ప్రయివేటీకరణ చేసిన మోడీ సర్కార్ కోవిడ్ స్పెషల్స్ పేరుతో రైళ్ళను ప్రస్తుతం నడుపుతుంది. అయితే [more]

Update: 2021-01-02 18:29 GMT

భారతీయ రైల్వే లో కొత్త శకం మొదలౌతుంది. ఇప్పటికే కొన్ని లైన్లను ప్రయివేటీకరణ చేసిన మోడీ సర్కార్ కోవిడ్ స్పెషల్స్ పేరుతో రైళ్ళను ప్రస్తుతం నడుపుతుంది. అయితే ఇవి పూర్తిగా ఎలాంటి రాయితీలను ఇవ్వకుండా ప్రయాణికులను తీసుకువెళ్ళే రైళ్ళు గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని లైన్లలో హై స్పీడ్ పేరిట రైళ్ళను ప్రయివేట్ పరం చేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో మరిన్ని లైన్లను, రైళ్ళను ప్రయివేట్ చేతిలో పెట్టేందుకే రైల్వే శాఖ వేగంగా అడుగులు వేస్తుంది.

ఇకపై కొత్త ఉద్యోగాలు ఉండవా … ?

భవిష్యత్తులో రైల్వే బోర్డు ద్వారా జరిపే ఉద్యోగ నియామకాలకు చెక్ పడనున్నట్లు తెలుస్తుంది. పాత వారు పదవీవిరమణ చేసిన ఖాళీలు అలాగే ఉంచాలని ప్రయివేట్ పరం చేసే ప్రక్రియలో ఇది కూడా భాగమని ఉద్యోగ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల కొంత లాభం కొంత నష్టం కూడా ఉందని అంటున్నారు. అవినీతి, ప్రాంతీయ అభిమానం, అక్రమాలు ప్రయివేటీకరణతో రైల్వే లో తుడిచిపెట్టుకుపోతాయని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే భారతీయ రైల్వే ద్వారా ఎందరో అభాగ్యులకు, పేదలకు అనితరమైన సేవలు ఇకపై ఉండవు. క్యాన్సర్ రోగులు, వికలాంగులు, వృద్ధులకు, జర్నలిస్ట్ లకు, విద్యార్థులకు ఇస్తున్న రాయితీలకు మంగళం తప్పదు. లక్ష రూపాయలు జీతం ఇచ్చే వ్యక్తిని తొలగించి ప్రయివేట్ లో నలుగురు ఉద్యోగులను పాతికవేల రూపాయలకే నియమిస్తారని అంటున్నారు.

కోవిడ్ తగ్గినా ఇదే విధానమా ?

దేశంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే రైల్వే సేవల్లో మాత్రం కోవిడ్ పేరుతో దోపిడీ కొనసాగుతూనే ఉంది. ఇది ప్రయివేట్ వారికి అప్పగించేందుకు ట్రయిల్ రన్ లో భాగమే అంటున్నాయి కొన్ని యూనియన్లు. అందుకే వచ్చే ఏడాది కూడా ఇప్పటిలాగే రైల్వే నడక సాగుతుందంటున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు లేకుండా జనరల్ కంపార్ట్మెంట్ లోకి సైతం అనుమతి లేదు. ఇదే పద్ధతి తో టిటిఈ వ్యవస్థకు మంగళం పాడి పూర్తిగా ఆన్ లైన్ విధానం అమలు చేయడానికి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తుంది. మొత్తానికి వచ్చే రెండేళ్లలో భారతీయ రైల్వే వ్యవస్థ బడా పారిశ్రామిక వేత్తల చేతికి చేరనుందన్నది మాత్రం స్పష్టం అవుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి లక్షల్లో రైల్వే ల ద్వారా కాసుల పంట ఉంటుందని ఆర్ధిక నిపుణుల అంచనా. చూడాలి మరి ఏమి జరగనుందో ..?

Tags:    

Similar News