జగన్ మెచ్చిన అధికారితోనే వైసీపీ వైరం.. ?

జగన్ కొందరు అధికారులను కోరి మరీ ముఖ్యమైన స్థానాలలో నియమించారు. అలా విశాఖ జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా ఉన్న జి సృజనను జగన్ విశాఖ కార్పోరేషన్ [more]

Update: 2021-08-05 02:00 GMT

జగన్ కొందరు అధికారులను కోరి మరీ ముఖ్యమైన స్థానాలలో నియమించారు. అలా విశాఖ జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా ఉన్న జి సృజనను జగన్ విశాఖ కార్పోరేషన్ కి కమిషనర్ ని చేశారు. ఎన్నికల వేళ ఆమెను పక్కన పెట్టాలని విపక్షాలు కోరడంతో కొన్నాళ్ళు ఆమె లూప్ లైన్ లో ఉన్నారు. ఫలితాల తరువాత తిరిగి ఆమె తన ప్లేస్ లోకి వచ్చేశారు. జగన్ ఆమెకు ఇంతలా ప్రాధాన్యత ఇవ్వడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఆమె సీమ ప్రాంతానికి చెందిన వారు. పైగా నిబద్ధతతకు మారుపేరుగా ఉంటారు. అందుకే ఆమెని జగన్ విశాఖ వంటి ప్రాంతాంలో కీలకమైన స్థానంలో ఉంచారు అంటారు.

ఆమె వద్దే వద్దు…

ఇన్నాళ్ళూ సృజన కమిషనర్ గా మొత్తం హవా చలాయించారు. కానీ ఇపుడు కౌన్సిల్ వచ్చింది. కార్పొరేటర్లు వచ్చారు. ప్రతీ వార్డుకూ వారున్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఆ పదవులలోకి వచ్చిన వారు తామే సామంతరాజులమని వ్యవహరించడం సహజం. అయితే సృజన ఐఏఎస్ అధికారిణిగా తన విధులను తాను చేసుకుంటూ పోతున్నారు. ఎవరి మాటను ఆమె పట్టించుకోవడంలేదు. రూల్స్ ప్రకారమే ఆమె ఫాలో అవుతారు. ఆమె నిజాయతీని కూడా ఎవరూ వంక పెట్టలేరు. అయితే కార్పోరేటర్లకు రాజకీయాలు ఉంటాయి. అవసరాలు ఉంటాయి. దాంతో చూసీ చూడమన్నట్లుగా ఉండమంటే ఆమె ససేమిరా అంటారు. దాంతో సృజనను వద్దే వద్దు అంటున్నారు విశాఖ అధికార పార్టీ కార్పోరేటర్లు.

పనులు కావడంలేదుట….

కమిషనర్ గా సృజన ఉంటే తమ పనులు ఏవీ కావడం లెదని కొత్త కార్పోరేటర్లు మండిపోతున్నారు. టీడీపీ వారి ఆక్రమణల మీద ఇన్నాళ్ళూ ఆమె ఉక్కుపాదం మోపితే సంతోషించిన వారే ఇపుడు వైసీపీ నేతలకు చెందిన వాటి మీదకు వస్తే మాత్రం కస్సుమంటున్నారు. చిన్న చిన్న పనులను కూడా ఆమె పట్టించుకుంటే ఎలా అంటూ గుర్రుమంటున్నారు. ఈ మధ్య మంత్రితో కార్పోరేటర్లు అంతా సమావేశమై ఒక్కటే కోరిక కోరారు. కమిషనర్ గా సృజన వద్దు, కొత్త వారిని తెచ్చుకుంచామని చెప్పేశారు. లేకపోతే మేమే అవిశ్వాసం పెట్టి మరీ ఆమెను పంపించేస్తామంటూ మంత్రికే కచ్చితంగా చెప్పేసారు.

అంతా సేమ్ సీన్….

ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావుకు కూడా సృజనతో బాధలు ఉన్నాయట. మంత్రిగా తాను చెప్పినా కూడా ఆమె వినడంలేదని మంత్రి అనడమే కొస మెరుపు. మీ బాధలు నా బాధలు సేమ్ కానీ నేను బయటపడలేను కదా అని మంత్రి గారు నిట్టూరుస్తున్నారుట. ఇక ఈ విషయాన్ని విజయసాయిరెడ్డికి, జగన్ కి చెప్పాలని ఆయన భావిస్తున్నారుట. అయితే ఏరి కోరి పంపించిన అధికారిణి బదిలీ చేయడానికి జగన్ ఒప్పుకుంటారా. సొంత పార్టీ వారి కోరికను మన్నించి తాను అనుకున్న విధానానికి విరుద్ధంగా వెళ్తారా అంటే చూడాలి మరి.

Tags:    

Similar News