నేదురుమ‌ల్లి ఫ్యామిలీ పాలిటిక్స్ క్లోజేనా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన నేదురుమ‌ల్లి జ‌నార్థన్ రెడ్డి గుర్తున్నారా? నెల్లూరు జిల్లాకు చెందిన ఈ ఫ్యామి లీ ఇప్పుడు రాజ‌కీయంగాఎక్కడా క‌నిపించ‌డం లేదు. వాస్తవానికి [more]

Update: 2020-01-29 06:30 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన నేదురుమ‌ల్లి జ‌నార్థన్ రెడ్డి గుర్తున్నారా? నెల్లూరు జిల్లాకు చెందిన ఈ ఫ్యామి లీ ఇప్పుడు రాజ‌కీయంగాఎక్కడా క‌నిపించ‌డం లేదు. వాస్తవానికి జ‌నార్థన్ రెడ్డితోపాటు ఆయ‌న స‌తీమ‌ణి రాజ్యల‌క్ష్మి కూడా రాజకీయాల్లోకి వ‌చ్చారు. వైఎస్ హ‌యాంలో వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి మంత్రి వ‌ర్గంలో బెర్త్‌ను కూడా సంపాయించుకున్నారు. అయితే, అనంత‌ర కాలంలో ఈ కుటుంబం నుంచి వార‌సుడిగా రంగంలోకి దిగిన నేదురుమ‌ల్లి రామ్ కుమార్ ప‌రిస్థితి ఇప్పటి వ‌ర‌కు ఎక్కడి గొంగ‌ళి అక్కడే అన్నచందంగా మారింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ప్రత్యక్ష్య రాజకీయాలకు…..

కాంగ్రెస్ పార్టీలో ఉద్ధండులుగా వెలుగొందిన నేదురుమ‌ల్లి ఫ్యామిలీ 1989లో నేదురుమ‌ల్లి జ‌నార్థన్‌రెడ్డి విజ‌యంతో వెంక‌ట‌గిరి రాజా వారికోట‌లో పాగా వేశారు. ఆ త‌ర్వాత కూడా ఆయ‌న స‌తీమ‌ణి రాజ్యల‌క్ష్మి 1999, 2004 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి వైఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ప‌నిచేశారు. ఇక‌, 2009, 2014లో మాత్రం ఈ ఫ్యామిలీ హ‌వా భారీగా ప‌డిపోయింది. 2009లో రాజ్యల‌క్ష్మి పోటీ చేసినా. విజ‌యం సాధించ‌లేక పోయారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల విష‌యానికి వ‌చ్చేస‌రికి కాంగ్రెస్ పూర్తిగా ఇబ్బందుల్లో కూరుకుపోవ‌డంతో రాజ్యల‌క్ష్మి పోటీకిదూరంగా ఉన్నారు. ఇక‌, అప్పటి నుంచి ఆమె దాదాపు ప్రత్యక్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు.

సీటు పై హామీ…..

ఇక‌, ఈ కుటుంబం నుంచి వార‌సుడిగా రంగంలోకి దిగిన రామ్‌కుమార్‌.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు చాలా విస్తృతంగా ప్రచారం లోకి వ‌చ్చారు. వెంక‌ట‌గిరి కోట‌లో మ‌ళ్లీ నేదురుమ‌ల్లి హ‌వాను నిల‌బెడ‌తాడ‌నే ప్రచారం జ‌రిగింది. అయితే, ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి చేరారు. అయితే, అక్కడ నిల‌దొక్కుకోలేక‌ ఎన్నిక‌ల‌కు ముందు టికెట్ ఆశించి జ‌గ‌న్ స‌మ‌క్షంలో పాద‌యాత్ర సాక్షిగా ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రామ్‌కుమార్‌కు జ‌గ‌న్ వెంక‌ట‌గిరి సీటుపై హామీ ఇచ్చారు.

నామినేటెడ్ పోస్టుల్లోనూ….

అయితే, తీరా ఎన్నిక‌ల స‌మ‌యానికి మాత్రం వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను జ‌గ‌న్ ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి కేటాయించారు. దీంతో రామ్ కుమార్ ఆశ‌లు ఫ‌లించ‌లేద‌నే వ్యాఖ్యలు వినిపించాయి. అయినా ఆయ‌న ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున గ‌ట్టిగా ప్రచారం చేశారు. పోనీ ఏదైనా నామినేటెడ్ ప‌ద‌వుల జాబితాలో అయినా ఆయ‌న పేరు ఉంటుందేమో అంటే అది కూడా లేక పోగా.. అస‌లు ఆయ‌న పేరు కూడా ఎక్కడా క‌నిపించ‌డం, వినిపించ‌డం లేదు. మ‌రి ఈయన రాజ‌కీయ ఫ్యూచ‌ర్ ఏమ‌వుతుందో చూడాలి.

Tags:    

Similar News