నవీన్ ఎత్తుగడకు వారు ఫట్టయినట్లేనా?

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అందరికంటే ముందుంటారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన నిర్ణయానికి తిరుగుండదు. నవీన్ పట్నాయక్ నిర్ణయాలపై ఎటువంటి వ్యతిరేకత ఉండదు. ఎందుకంటే ఆయన డెసిషన్స్ [more]

Update: 2020-03-12 17:30 GMT

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అందరికంటే ముందుంటారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన నిర్ణయానికి తిరుగుండదు. నవీన్ పట్నాయక్ నిర్ణయాలపై ఎటువంటి వ్యతిరేకత ఉండదు. ఎందుకంటే ఆయన డెసిషన్స్ అలా ఉంటాయి. ఒడిశాలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే బిజూ జనతా దళ్ కు శాసనసభలో ఉన్న బలం ప్రకారం నాలుగింటిలో మూడింటిని మాత్రమే గెలుచుకునే వీలుంది.

మూడు స్థానాలను మాత్రమే…..

అంతకు సరిపడా మాత్రమే బలముంది. నాలుగో స్థానాన్ని దక్కించుకోవాలంటే ఎన్నిక ఏకగ్రీవం కావడం, లేక ఇతర పార్టీల మద్దతు తీసుకోవడం తప్పనిసరి. అయితే నవీన్ పట్నాయక్ నాలుగు రాజ్యసభ స్థానాలకు తమ పార్టీ బిజూ జనతాదళ్ నుంచి అభ్యర్థులను ప్రకటించి ఆశ్చర్య చకితులను చేశారు. తనకు అత్యంత విధేయులు, పార్టీ కోసం శ్రమించిన వారికి రాజ్యసభ స్థానాలను నవీన్ పట్నాయక్ కేటాయించారు.

విధేయులకే పట్టం…..

సుభాష్ సింగ్, మున్నాఖాన్, సుజిత్ కుమార్, మమత మొహంతోలను రాజ్యసభకు తమ పార్టీ అభ్యర్థులగా ప్రకటించారు. వీరిలో సుభాష్ సింగ్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు విధేయుడు. కటక్ కు చెందిన సుభాష్ సింగ్ ఎప్పటి నుంచో నవీన్ ను నమ్ముకుని ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోె పార్టీ టిక్కెట్ దక్కకపోయినా అసంతృప్తి చెందకుండా పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఇక మున్నాఖాన్ బిజూ జనతాదళ్ మైనారిటీ సెల్ నేతగా ఉన్నారు. మైనారిటీలకు స్థానం కల్పించడంలో భాగంగా ఆయనకు నవీన్ పట్నాయక్ అవకాశం కల్పించారు.

నాలుగో స్థానాన్ని కూడా….

సుజిత్ కుమార్ కూడా అంతే. ఆయన నవీన్ ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి కమిషన్ అడ్వయిజర్ గా పనిచేస్తున్నారు. నాలుగో స్థానాన్ని తెలివిగా నవీన్ పట్నాయక్ ఆదివాసీ మహిళ కు కేటాయించారు. మమత మొహంతో బిజూ జనతాదళ్ మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే నాలుగో స్థానం దక్కించుకోవడం కోసం నవీన్ పట్నాయక్ బీజేపీ సహకారం తీసుకునే వీలుందంటున్నారు. కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేయడం లేదు. బీజేపీకి నవీన్ కు సహకరించడం తప్ప మరో మార్గం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. నవీన్ ఎత్తుగడ ఫలిస్తుందో? లేదో? అన్నది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News