నవీన్ పట్నాయక్ పెద్దమనసు

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎప్పుడూ సేవలో ముందుంటారు. ఆయన రాజకీయాలను ఎన్నికల సమయంలో మాత్రమే పట్టించుకుంటారు. మిగిలిన సమయాన్ని అంతా ప్రజా సేవకే వినియోగిస్తారు. అందుకే [more]

Update: 2021-05-06 17:30 GMT

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎప్పుడూ సేవలో ముందుంటారు. ఆయన రాజకీయాలను ఎన్నికల సమయంలో మాత్రమే పట్టించుకుంటారు. మిగిలిన సమయాన్ని అంతా ప్రజా సేవకే వినియోగిస్తారు. అందుకే నవీన్ పట్నాయక్ ఐదు దఫాలుగా ఒడిశా ముఖ్యమంత్రిగా విజయం సాధిస్తుంటారు. కష్టసమయాల్లో తమను ఆదుకుంటారన్న నమ్మకమే నవీన్ పట్నాయక్ ను రాజకీయంగా నిలబెడుతుందనడంలో సందేహం లేదు.

అప్పుడే రాజకీయాలు….

నవీన్ పట్నాయక్ ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాలకే పరిమితమవుతారు. దేశ రాజకీయాల జోలికి పోరు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరుపుతూనే రాష్ట్ర అవసరాలను పూర్తయ్యేలా నవీన్ పట్నాయక్ వ్యవహరిస్తారు. అది యూపీఏ కావచ్చు. ఎన్డీఏ కావచ్చు. ఆయనకు రాజకీయంగా శత్రువుల కంటే మిత్రులే ఎక్కువ. అందుకే సుదీర్ఘ కాలం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా రాష్ట్రాన్ని ఏలుతూ వస్తున్నారు.

ఆక్సిజన్ కొరత ను….

దేశమంతా కరోనా తో అల్లాడి పోతుంది. ఒడిశాలో సయితం కేసులు భారీగానే వస్తున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే నవీన్ పట్నాయక్ దేశ అవసరాలను కూడా తీర్చడానికి ముందుకు వచ్చారు. ప్రధానంగా ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. అనేక మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు వదులుతున్నారు. ఈనేపథ్యంలో నవీన్ పట్నాయక్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడి ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చారు.

ఇతర రాష్ట్రాలకు….

ఒడిశాలో జాజ్ పూర్ టాటా స్టీల్ ప్లాంగ్, అనుగుల్ లోని జిందాల్, భూషణ్, ఇడ్కో వంటి సంస్థల ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ సంస్థల్లో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని నవీన్ పట్నాయక్ ఆదేశించారు. ఆక్సిజన్ కొరత ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలకు ఒడిశా నుంచి ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. విమానాలు, రోడ్డుమార్గాల ద్వారా తరిలిస్తున్నారు. ఆక్సిజన్ రవాణాను ఎవరూ అడ్డుకోకుండా పోలీసులు గ్రీన్ కారిడార్ ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో నవీన్ పట్నాయక్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News