నవీన్ కు సెగ మొదలయిందా?

ఇరవై ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నవీన్ పట్నాయక్ పైన ప్రజలకు ఏ మాత్రం విశ్వాసం చెక్కు చెదరలేదు. కానీ పార్టీలోని నేతల్లో మాత్రం ఆయనపై తీవ్రమైన [more]

Update: 2020-07-28 16:30 GMT

ఇరవై ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నవీన్ పట్నాయక్ పైన ప్రజలకు ఏ మాత్రం విశ్వాసం చెక్కు చెదరలేదు. కానీ పార్టీలోని నేతల్లో మాత్రం ఆయనపై తీవ్రమైన అసంతృప్తి ఉందంటున్నారు. పదవుల కేటాయింపుల్లోనూ, ప్రాధాన్యత ఇవ్వడంలోనూ నవీన్ పట్నాయక్ కొత్తగా పార్టీలో చేరిన వారికి పెద్దపీట వేయడాన్ని సీనియర్లు సయితం జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో నెలకొన్న అసంతృప్తులను తొలగించేందుకు పార్టీ కార్యవర్గంలోని నేతలకు శాఖలకు కేటాయించడం వివాదాస్పదంగా మారింది.

ప్రజలు కట్టబెడుతున్నా….

బిజూ జనతా దళ్ కు ఒడిశాలో తిరుగులేదు. గత ఐదు ఎన్నికల నుంచి తిరుగులేని మెజారిటీని ఒడిశా ప్రజలు నవీన్ పట్నాయక్ కు కట్టబెడుతున్నారు. నవీన్ పట్నాయక్ కూడా అవినీతి పాలన అందిస్తుండటం, ప్రజలకు సంక్షేమ పథకాలను లెక్కకు మిక్కిలిగా అందిస్తున్నారు. దీంతో ఇక్కడ విపక్షాలకు దిక్కు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడింది. ఒక్క బీజేపీ మాత్రం పార్లమెంటు ఎన్నకల్లో కొంత మెరుగైన ఫలితాలను సాధిస్తుంది.

కఠినంగా వ్యహరిస్తూ…..

ఇక నవీన్ పట్నాయక్ 2000 సంవత్సరం నుంచి ఒడిశాకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయనను నిన్న మొన్నటి వరకూ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నవీన్ పట్నాయక్ మాటకు తిరుగుండేది కాదు. ఇప్పుడిప్పడే అసంతృప్తి తలెత్తుందని అంటున్నారు. ముఖ్యంగా నవీన్ పట్నాయక్ మంత్రుల పట్ల కఠినంగా ఉంటారు. వారి పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేసి అవసరమైతే వారిని మంత్రివర్గం నుంచి తప్పించడానికి కూడా నవీన్ పట్నాయక్ వెనుకాడరు.

ఇప్పడిప్పుడే మొదలయిన….

ఈ పరిస్థితుల్లో మొన్నటి ఎన్నికల్లో గెలిచిన నవీన్ పట్నాయక్ మంత్రి వర్గ ఏర్పాటు చూసి అందరూ విస్తుపోయారు. 54 మంది తో అతిపెద్ద మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు పార్టీలోని ముఖ్యనేతలందరికీ శాఖలను కేటాయించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. మంత్రులు కాకున్నా వీరంతా ఆ శాఖలపై ఆధిపత్యం చేస్తారు. దీంతో ఉన్న మంత్రుల్లో అసంతృప్తి తలెత్తిందన్న కామెంట్స్ పడుతున్నాయి. మొత్తం మీద నవీన్ పట్నాయక్ దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్దాయన అసంతృప్తిని ఎదుర్కొంటున్నారని చెప్పక తప్పదు. అయితే నవీన్ కాదని వెళ్లిన వారు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అసంతృప్తి నేతలు పెద్దగా సాహసం చేయకపోవచ్చంటున్నారు.

Tags:    

Similar News